‘కెంట్‌’ త్వరలో ప్రపంచమంతటా..!

Kent coronavirus variant set to sweep world says UK scientist - Sakshi

లండన్‌: ‘యూకేలో బయట పడిన కరోనా స్ట్రెయిన్‌ ‘కెంట్‌’ త్వరలో ప్రపంచమంతటా వ్యాపించే అవకాశం ఉంది. ఈ తరహా మ్యుటేషన్‌ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చు’ అంటూ యూకే కోవిడ్‌–19 యూకే కన్సార్టియం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీకాక్‌ అభిప్రాయపడ్డారు. 2020 సెప్టెంబర్‌లో బయటపడిన ఈ స్ట్రెయిన్‌ ఇప్పటికే యూకేతో పాటు మరో 50 దేశాలకు వ్యాపించిందని ఆమె చెప్పారు. వైరస్‌ మ్యుటేషన్‌ జరగకుండా ఆగిపోతే బాధపడాల్సిన అవసరం లేదని, కానీ ఈ మ్యుటేషన్‌ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చని భావిస్తున్నాను అంటూ హెచ్చరించారు. అయితే పదేళ్ల పాటు మహమ్మారి కొనసాగకపోవచ్చని, కానీ పాజిటివ్‌ కేసుల్లో వచ్చే మ్యుటేషన్‌ ప్రపంచంలో అక్కడక్కడా బయట పడొచ్చని అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top