Joe Biden Nuclear Briefcase Spotted During London Visit - Sakshi
Sakshi News home page

రష్యాకు వార్నింగ్ ఇస్తోన్న అమెరికా అధ్యక్షుడు.. చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్

Published Wed, Jul 12 2023 2:03 PM

Joe Biden Nuclear Briefcase Spotted During London Visit - Sakshi

లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ దర్శనమిచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడకు ఆయనతో పాటు ఈ బ్లాక్ లెదర్ సూట్ కేసును వెంట తీసుకెళ్లడం రష్యాకు కీడు శంకిస్తోందని చెబుతున్నాయి స్థానిక మీడియా వర్గాలు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమయంలో వైట్ హౌస్ దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినపుడు ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును అయన తన వెంట తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ లండన్ పర్యటనకు ఈ బ్రీఫ్ కేసును తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే.. 
అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అణుబాంబుల ప్రయోగానికి ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసు నుంచి ఆదేశించవచ్చు. 20 కిలలో బరువుండే ఈ బ్యాగ్లో న్యూక్లియర్ లాంచ్ కు సంబంధించిన కోడ్ పొందుపరచి ఉంటుంది. దీన్నే అటామిక్ బాంబు గానూ ప్రెసిడెంట్ అత్యవసర హ్యాండ్ బ్యాగ్ గానూ చెబుతూ ఉంటారు. సాయుధ దళానికి చెందిన సైనికుడు అధ్యక్షుడి వెంట దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. 

రష్యా గురించేనా..?
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే జో బైడెన్ ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును తనవెంట తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆదేశాలిచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు తన చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు తీసుకెళ్లారని వారంటున్నారు.  

నాటో సమావేశానికి ముందు సన్నాహకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో భేటీ అయిన బైడెన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే ఉక్రెయిన్ సభ్యత్వం గురించి పరిగణిస్తామని ఇదివరకే చెప్పిన బైడెన్ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

ఇది కూడా చదవండి: ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..?
 

Advertisement
Advertisement