ఓం న‌మః శివాయ అంటున్న‌ ఇజ్రాయెల్‌ వాసులు

Israelis Chant Om Namah Shivaya Pray For India Recovery Against Covid - Sakshi

సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోన్న వీడియో

జెరూసలెం: కోవిడ్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ దేశాల‌న్ని భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. త‌మ‌కు తోచిన మేర సాయం చేస్తూ.. సంఘీభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొన్ని దేశాలు వైద్య పరికరాలు, సామాగ్రి రూపంలో మానవతా సహాయం అందిస్తున్నాయి. ఈ జాబితాలో ఇజ్రాయెల్ కూడా ఉంది. భార‌త్‌కు మ‌ద్ద‌తుగా రెండు ఆక్సిజ‌న్ కాన్‌సన్‌ట్రేట‌ర్స్‌, రెస్సిరేట‌ర్స్ పంపి సాయం చేసింది. 

ఇదేకాక ఆ దేశ ప్ర‌జ‌లు భార‌త్ కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ‘ఓం నమః శివాయః’ అంటూ పరమేశ్వరుడిని స్మరిస్తున్నారు. ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారి పవన్ కె పాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఈ వీడియో పోస్టు చేశారు. వందలాది ఇజ్రాయెల్ ప్రజలు టెల్ అవీవ్‌లోని ప్రధాన కూడలిలో శివలింగాలను ఏర్పాటుచేసి మరీ ‘ఓం నమః శివాయ’ అంటూ ప్రార్థనలు జరపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

దీనిలో ఇజ్రాయేల్ ప్ర‌జ‌లు వైరస్‌తో విలవిల్లాడుతున్న భార‌త దేశ ప్రజలను కాపాడాలని కోరుతూ పరమేశ్వరుడిని స్మరిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన భారతీయ నెటిజనులు ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు చేసిన ఈ కార్యక్రమం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, త్వరలోనే ఇండియా కోవిడ్ నుంచి ముక్తి పొందాలని కోరుకుంటున్నామని కామెంట్ చేస్తున్నారు నెటిజ‌నులు. 

చ‌ద‌వండి: హృదయం ముక్కలైంది.. సోనూసూద్‌ ఎమోషనల్‌
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top