
రఫా(గాజా స్ట్రిప్): తమతమ మతసంబంధ పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం ఘర్షణలతో మొదలై మెరుపు దాడులతో తీవ్రతరమై మహోగ్రరూపం దాలి్చన హమాస్– ఇజ్రాయెల్ పోరు పాతికవేల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది.
మరోవైపు వంద మందికిపైగా బందీలను విడిపించుకున్నాసరే అందర్నీ విడిపిస్తామని, హమాస్ సభ్యులందర్నీ హతమారుస్తామని ఇజ్రాయెల్ సేనల ప్రతినబూనడం చూస్తుంటే యుద్ధ బాధితులు, మరణాల సంఖ్య ఇక్కడితో ఆగేలా లేదు. యుద్ధం ఇంకొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు తాజాగా ప్రకటించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా బందీలను విడిపించలేకపోవడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు ప్రదర్శలు పెరిగాయి.