అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల | Indonesia Man Coiled By Giant Anaconda Viral Video | Sakshi
Sakshi News home page

అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల

Dec 17 2020 9:01 PM | Updated on Dec 17 2020 9:07 PM

Indonesia Man Coiled By Giant Anaconda Viral Video - Sakshi

అనకొండకు చిక్కిన ఇండోనేషియా వ్యక్తి

జకార్తా :  ప్రపంచ వ్యాప్తంగా మనుషులు అనకొండకు ఫలహారమైన ఘటనలు చాలానే ఉన్నాయి. అనవసరంగా ఇవి మనుషుల్ని చంపకపోయినా.. అవకాశం దొరికినప్పుడు మాత్రం వదలవు. 15-20 అడుగుల పొడవున్న అనకొండలు సులభంగా మనల్ని మింగేయగలవు. ఓ సారి దాని పట్టుకు చిక్కామంటే విడిపించుకోవటం బ్రహ్మకష్టమే. తాజాగా ఓ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి భారీ అనకొండకు చిక్కాడు. దాని నుంచి విడిపించుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. అయితే అతడి ఒక్కడి వల్ల కాలేదు. ( వైరల్‌: మొసలిని చుట్టేసిన భారీ అనకొండ)

అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడికి సహాయంగా వచ్చారు. దాన్ని పక్కకు లాగి అతడ్ని కాపాడాలనుకున్నారు. వారికి కూడా అది కష్ట సాధ్యంగా మారింది. ఎలాగైతేనేం తీవ్రంగా ప్రయత్నించి పామునుంచి అభాగ్యుడ్ని రక్షించగలిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement