భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్‌ అవార్డు

Indian-origin UK minister Suella Braverman wins first Queen Elizabeth II award - Sakshi

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ (42) మొట్టమొదటి క్వీన్‌ ఎలిజబెత్‌–2 ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకున్నారు. లండన్‌లో శనివారం జరిగిన 20వ ఆసియన్‌ అఛీవర్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు.

బ్రేవర్‌మన్‌ తల్లి తమిళ మూలాలున్న ఉమ, తండ్రి గోవాకు చెందిన క్రీస్టీ ఫెర్నాండెజ్‌. సుయెల్లా లండన్‌లో జన్మించారు. బ్రిటన్‌లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top