ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..

Indian Origin Girl Hair Gets Stuck In Go Kart In South Africa Still ICU - Sakshi

భారత సంతతి టీనేజ్‌ అమ్మాయికి దారుణమైన ప్రమాదం బారిన పడింది. ఏకంగా నెత్తిపై జుట్టుతో సహా చర్మం ఊడొచ్చి.. వెన్నుకి సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకెళ్తే..దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో గేట్‌వే మాల్‌లో భారత సంతతికి చెందిన క్రిస్టినా అనే టీనేజ్‌ అమ్మాయి  గో కార్ట్‌ అనే స్పోర్ట్స్‌  కారుని నడుపుతోంది. అనుహ్యంగా ఆమె జుట్టు ఆ కారు చక్రాల్లో ఇరుక్కుపోయింది.

దీంతో తలపై ఉన్న హెల్మట్‌ పడిపోయి.. నెత్తిమీద ఉన్న జుట్టుతో సహా చర్మం ఊడొచ్చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. అంతేకాదు ఈ ప్రమాదంలో ఆమె వెన్నుకి కూడా తీవ్రగాయాలయ్యయి. ఈ ఘటన డర్బన్‌లోని ప్రముఖ గేట్‌ వే మాల్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌లో గత బుధవారం జరిగింది. కానీ క్రిస్టినా ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. ఈ మేరకు బాధితురాలి తండ్రి వెర్నాన్‌ గోవేందర్‌ మాట్లాడుతూ...రేసింగ్‌ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియనిబంధనలు పాటించిందని అన్నారు.

కానీ ఆ గో కార్ట్‌(స్పోర్ట్స్‌) కారులోని పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. ఆమె తన జుట్టును కూడా పోనీటైల్‌లా కట్టేసిందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం తక్షణ సాయం అందించడంలో విఫలమైందని చెప్పారు. ఆ సమయంలో తన కూతురు వద్ద తన  13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని ఈ ఘటన గురించి చెప్పేందుకు గో కార్ట్‌ కార్యాలయానికి కూడా వెళ్లాడని చెప్పారు. ఐతే అప్పటికే కార్యాలయాన్ని మూసేసి, వారంతా వెళ్లిపోయినట్లు వాపోయారు.

రేసింగ్‌ కోర్సులో భాగంగా తన కూతురు క్రిస్టినా గో కార్ట్‌ని నేర్చుకుంటుండగా.. స్పిన్‌ అవుతున్న సమయంలో గో కార్ట్‌లోని చట్రంలో ఆమె జుట్లు ఇరుక్కుపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరొకరెవరూ.. ఇలాంటి ఘోరమైన ప్రమాదం బారినపడకూదని..సదరు గోకార్ట్‌ యాజమాన్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి తండరి గోవేందర్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు యాక్షన్ కార్టింగ్ గేట్‌వే యజమాని స్టీవెన్ పూల్ మాట్లాడుతూ.."రేస్‌ జరుగుతున్న ట్రాక్‌ వద్ద అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి అనుహ్య ఘటన జరగలేదు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని, కానీ ఆ సమయంలో బాధితురాలు క్రిస్టినా మామ చాలా దూకుడుగా ప్రవర్తించాడు. మాకు ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంది. క్లైయింట్స్‌ అందరికీ సంరక్షణ పద్ధతులకు సంబంధించిన రేసింగ్‌ వీడియోని చూపిస్తాం. అలాగే కార్ట్‌ని ఎలా నడపాలి, ఎలా హ్యాండిల్‌ చేయాలనేదానిపై కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆఖరికి ఇలాంటివి చేసేటప్పుడూ..జుట్టును ఎలా కట్టుకోవాలో కూడా పూర్తిగా వివరిస్తాం. ఐతే ఒకప్పుడూ ఈ రేసింగ్‌ నేర్చుకుంటున్న వాళ్లకి తమ సిబ్బందే జుట్టును దగ్గరుండి ముడివేసి కట్టేదని, కానీ తల్లిదండ్రుల అయిష్టత చూపడం తోపాటు ఫిర్యాదుల చేయడంతో వారి వ్యక్తిగతానికే వదిలేశామని" వివరించాడు స్టీవెన్ పూల్. 

(చదవండి: భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్‌? కొండపై నుంచి కారును అమాంతం..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top