సూడాన్‌ ఘర్షణల్లో భారతీయుడు మృతి 

Indian Lost Life In Sudan Violence Clashes - Sakshi

సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లోని సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 61 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో ఆల్బర్ట్‌ ఆగస్టీన్‌ అనే భారతీయుడు ఉన్నారు. సూడాన్‌లో 2021 అక్టోబర్‌లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అత్యున్నత మండలి అధికారం చెలాయిస్తోంది.

అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారం అప్పగించే విషయంలో ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఖార్టూమ్‌లోని అధ్యక్ష భవనాన్ని, విమానాశ్రయాన్ని, ఇతర కీలక ప్రాంతాలు తమ ఆధీనంలోనే ఉన్నట్లు సైన్యం, పారా మిలటరీ బలగాలు ప్రకటించుకున్నాయి. శనివారం నుంచి రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తలెత్తిన హింసాత్మక ఘటనల్లో 61 మంది పౌరులు చనిపోయారు.

ఇరుపక్షాలకు చెందిన డజన్లకొద్దీ మరణించి ఉంటారని వైద్యుల సంఘం ఒకటి అంటోంది. మరో 670 మంది గాయపడినట్లు చెబుతోంది. దాల్‌ గ్రూప్‌ కంపెనీ ఉద్యోగి, భారతీయుడు ఆల్బర్ట్‌ ఆగస్టీన్‌ తుపాకీ కాల్పుల్లో చనిపోయినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది.
చదవండి: ఆశాకిరణం ఆఫ్రికా..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top