ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?

The Indian American V A Shiva Ayyadurai invented Email at 14 yrs of age - Sakshi

ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్‌ను కనుగొన్నాడు. ఈ-మెయిల్‌ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు. శివ అయ్యదురై 1978లో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశాడు. దానిని ఈ-మెయిల్ అని పిలుస్తారు. 

ఈ-మెయిల్ టు బాక్స్, ఇన్‌బాక్స్, ఫోల్డర్‌లు, మెమోలు వంటి ఈ ప్రోగ్రామ్‌లు శివ అయ్యదురై ఈ మెయిల్‌లో కనిపించే ప్రధాన లక్షణాలు, ఇప్పటికీ అవి ఉన్నాయి. శివ అయ్యదురైని ఈమెయిల్ కనుగొన్న వ్యక్తిగా అమెరికా ప్రభుత్వం ఆగష్టు 30, 1982 అధికారికంగా గుర్తించింది. ఈ-మెయిల్ సృష్టికర్తగా శివ అయ్యదురైకి 1978లో యూఎస్ కాపీరైట్ హక్కులు లభించాయి. తమిళ కుటుంబానికి వెల్లయప్ప అయ్యదురై శివ డిసెంబర్ 2, 1963న ముంబైలో జన్మించారు. తనకు ఏడు ఏళ్లు ఉన్నప్పుడు శివ కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. 

అయ్యదురై 14 ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని కొరెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌లో ఒక ప్రత్యేక ఇంటిగ్రేషన్ కార్యక్రమంలో చేరాడు. అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి నాలుగు డిగ్రీలు పొందాడు. కొంచెం ఈ-మెయిల్ సృష్టికర్త విషయంలో కొందరు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రే టాంలిన్సన్ ఈ-మెయిల్ సృష్టించినట్లు భావిస్తున్నారు.

చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top