చైనాలో వైద్య విద్యపై జాగ్రత్త | Sakshi
Sakshi News home page

చైనాలో వైద్య విద్యపై జాగ్రత్త

Published Sun, Sep 11 2022 5:55 AM

India issues guidelines to students wish to study medicine in China - Sakshi

బీజింగ్‌: చైనాలో కరోనాతో కారణంగా ఆగిన వైద్య విద్యను కొనసాగించాలనుకునే, అక్కడ కొత్తగా మెడిసన్‌ చేయాలనుకునే భారత విద్యార్థులకు చైనాలోని ఇండియన్‌ ఎంబసీ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్కడ చదివిన వారిలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం, చైనా భాషను నేర్చుకోవడం, తిరిగొచ్చాక కఠినమైన ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్ష (ఎఫ్‌ఎంజీ) పాసవడం వంటివి దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.

► 2015–2021 కాలంలో 40,417 మంది ఎఫ్‌ఎంజీ పరీక్ష రాస్తే 6,387 మందే గట్టెక్కారు.
► వీరంతా చైనాలోని 45 వర్సిటీల్లో చదివినవారే.
► ఇక నుంచి చైనాకు వెళితే ఈ 45 కాలేజీల్లోనే చదవాలి. అదీ ఇంగ్లీష్‌ మాధ్యమంలోనే.
► చైనీస్‌ భాషలో మెడిసన్‌ చేయకూడదు. ఇంగ్లీష్‌–చైనీస్‌ ద్విభాషగా చేసినా చెల్లుబాటు కాదు.
► చైనా అధికారిక భాష పుతోంగ్వాను హెచ్‌ఎస్‌కే–4 లెవల్‌ వరకు నేర్చుకోవాలి. లేదంటే డిగ్రీ ఇవ్వరు.
► చైనాలోనే ప్రాక్టీస్‌ చేయాలనుకుంటే మళ్లీ లైసెన్స్‌ను సాధించాలి. ఐదేళ్ల మెడిసిన్‌ తర్వాత ఏడాది ఇంటర్న్‌షిప్‌ చేయాలి. తర్వాత చైనీస్‌ మెడికల్‌ క్వాలిఫికేషన్‌ ఎగ్జామ్‌ పాస్‌ అవ్వాలి.
► చైనా నుంచి మెడికల్‌ క్వాలిఫికేషన్‌ పొందాలంటే ముందు భారత్‌లో నీట్‌–యూజీ పాసవ్వాలి.
► చైనా నుంచి వచ్చే వారూ నీట్‌–యూజీలో ఉత్తీర్ణత సాధించాకే ఎఫ్‌ఎంజీఈకి అర్హులౌతారు.
► కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగా సంబంధిత పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement