Husband Shocked To Find Of Wife Marrying Another Man On Social Media - Sakshi
Sakshi News home page

ఆమెకు 19 మంది భర్తలు..!

Jun 6 2021 4:56 PM | Updated on Jun 7 2021 2:12 PM

Husband Shocked To Find Of Wife Marrying Another Man On Social Media - Sakshi

బీజింగ్ : ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాను బ్రౌజ్ చేస్తుండ‌గా త‌న భార్య వీడియోల్ని చూసి కంగుతిన్నాడు. ఆ వీడియోలో జ‌రిగిన తంతు చూసి ఇది నిజమేనా అని అనుకున్నాడు. త‌న భార్య గురించి  బుర్రను తొలుస్తున్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవాల‌ని పోలీసుల్ని ఆశ్ర‌యించాడు. చివ‌రికి నెత్తి నోరు బాదుకున్నాడు.  చైనా మంగోలియాలోని బ‌యాన్నూర్ కు చెందిన ఓ వ్య‌క్తి ఈ ఏడాది జ‌న‌వ‌రిలో పెళ్లికోసం మ్యారేజ్ బ్యూరోని  ఆశ్ర‌యించాడు. వ్య‌క్తి కోరుకున్న‌ట్లు మ్యారేజ్ బ్యూరో ప్ర‌తినిధులు గ‌న్సు అనే ప్రాంతంలోఓ సంబంధం చూశారు. అమ్మాయి బాగుంది. కాక‌పోతే వ‌ధువే .. వరుడిని ఎదురు క‌ట్నం కింద 148,000 యువాన్లు (రూ.16.9ల‌క్ష‌ల ) అడిగింది. అందుకు పెళ్లికొడుకు నాకు న‌చ్చిన అమ్మాయిని చూశారు. ఎదురు క‌ట్నం ఎంతైనా ఇస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు. అనుకున్న‌ట్లుగానే రూ.16.9ల‌క్ష‌లు ఎదురు క‌ట్నం కూడా ఇచ్చాడు.  వివాహం సాంప్ర‌దాయ బ‌ద్దంగా జ‌రిగింది.  చ‌ద‌వండి : ఒక పెళ్లి.. రెండు బరాత్​లు.. ట్విస్ట్​ ఏంటంటే..

పెళ్లి త‌రువాత నూత‌న వ‌ధువరులు అన్యోన్యంగా మెలుగుతున్నారు. అయితే పెళ్లైన రెండు నెల‌ల త‌రువాత ఏవండి ! మ‌న పెళ్లై రెండు నెల‌ల అవుతుంది. మా అమ్మా నాన్న గుర్తుకొస్తున్నారు. మీరు అనుమ‌తి ఇస్తే ఓ సారి పుట్టింటికి వెళ్లాల‌ని అనుకుంటున్నాను. మీరేమంటారు? అని అడిగింది. అస‌లే పెళ్లై రెండు నెల‌ల‌వుతుంది. భార్య మ‌న‌స్సు నొప్పించ‌డం ఇష్టం లేక‌. స‌రే అని అత్తారింటికి పంపాడు.రోజులు గ‌డుస్తున్నాయి. భార్య పుట్టింటి నుంచి రావ‌డం లేదు. అదే స‌మ‌యంలో ఓ రోజు ఇంట్లో ఖాళీ గా ఉన్న భ‌ర్త సోష‌ల్ మీడియాను బ్రౌజ్ చేస్తుండ‌గా త‌న భార్య మ‌రొకరిని వివాహం చేసుకున్న వీడియోల్ని చూసి షాక్ అయ్యాడు. 

ఆ ఆధారాల‌తో స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.ఈ ద‌ర్యాప్తులో పోలీసులు, భ‌ర్త  విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. డ‌బ్బుల కోసం మ్యారేజ్ బ్యూరో ప్ర‌తినిధులు భారీ ఎత్తున మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింది.పెళ్లికి ముందే ఎదురు క‌ట్నం తీసుకోవ‌డం. పెళ్లి త‌రువాత ప‌త్తాలేకుండా పోవ‌డం.. పారిపోయి మ‌రొక‌రిని పెళ్లి చేసుకోవ‌డం. ఇలా  గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెళ్లి కాని 19మంది యువ‌కుల్ని పెళ్లి చేసుకుంద‌ని, వారి వ‌ద్ద నుంచి  రూ. 2.28కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులైన మ్యారేజ్ బ్యూరో ప్ర‌తినిధి లీ' తో పాటూ మ‌రో ఇద్ద‌రు స‌భ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement