టెహ్రాన్: ప్రపంచంలో అత్యంత ఆధునిక, అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్‌గా పేరుగాంచిన ఎఫ్-35ను ఇరాన్ ఎలా గుర్తించింది, ఎలా పేల్చేసింది? ఎఫ్-35 శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. అయినప్పటికీ, ఇరాన్ దాని పని పట్టింది.
ఇరాన్‌కు ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై పై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా, 44 సెకన్ల ఓ యానిమేటెడ్ క్లిప్ దీన్ని కొత్త కోణంలో విశ్లేషించి చూపించింది. రాడార్ సంకేతాలపై ఆధారపడకుండా ఇరాన్ ప్యాసివ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లపై ఆధారపడి ఉండొచ్చు. అంటే, ఏదైనా వస్తువు నుంచి వెలువడే వేడి (ఉష్ణం)ని గుర్తించి, ఆ వేడి ఆధారంగా ఆ వస్తువు ఎక్కడ ఉంది? ఎలా కదులుతోంది? అనేది దీని ద్వారా గుర్తించొచ్చు. ఉదాహరణకు జెట్ ఇంజిన్ చాలా వేడిని విడుదల చేస్తుంది. ఆ వేడిని సెన్సర్లు గుర్తించి, ఆ జెట్ స్థానాన్ని తెలుసుకుంటాయి. దీంతో పైలట్లకు ఇరాన్ సైనికులు తమను గమనిస్తున్నారని తెలియకపోవచ్చు.
ఇరాన్ ఎఫ్-16ను కూడా దెబ్బతీసినట్లు ప్రకటించింది. నిన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దేశ మధ్యభాగంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించాయి. “జయోనిస్టు పాలనకు చెందిన ఎఫ్-16 శత్రు ఫైటర్ జెట్‌ను ఉదయం 3.45 గంటలకు దెబ్బతీశాం” అని గార్డ్స్ తమ సెపా న్యూస్ వెబ్‌సైట్‌లో తెలిపాయి.
ఇరాన్ మీడియా ఆకాశంలో పొగ కనిపిస్తున్న చిత్రాన్ని విడుదల చేసి, మరో విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది, కానీ అది ఏ రకమో లేదా ఇజ్రాయెల్‌దా, అమెరికాదా అన్నది కూడా వెల్లడించలేదు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ యానిమేషన్ వీడియో నిశ్శబ్ద ప్యాసివ్ గుర్తింపు సిద్ధాంతాన్ని చూపుతోంది. టెక్ వ్యాఖ్యాత ఫుర్కాన్ గోజుకారా ఎక్స్‌లో పంచుకున్న ఈ క్లిప్ ఈ విషయాన్ని వివరిస్తుంది. తరంగాలను విడుదల చేసే రాడార్ వ్యవస్థలతో భిన్నంగా, ప్యాసివ్ ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థలు నిశ్శబ్దంగా ఉండి, ముఖ్యంగా జెట్ ఇంజిన్ల నుంచి వచ్చే వేడిని గుర్తిస్తాయి.
యానిమేషన్‌లో ప్రకాశించే గుర్తులు విమానం ప్రయాణ మార్గాన్ని చూపుతాయి, సెన్సర్లు ఎటువంటి హెచ్చరిక లేకుండా లక్ష్యాన్ని పట్టుకుంటాయి. ఏ సంకేతం ప్రసారం కాకపోవడంతో విమానంలో ఉన్న హెచ్చరిక వ్యవస్థలు అలర్ట్ ఇవ్వవు.
యానిమేటెడ్ క్లిప్ ఇదే..
Iran is brilliantly bypassing billion dollar stealth tech using passive detection systems. Instead of radar, they use advanced infrared sensors to track heat signatures. It emits no signal, giving US pilots zero warning they are being targeted. Absolute game changer. pic.twitter.com/YCXtYEjvKj
— Furkan Gözükara (@FurkanGozukara) March 22, 2026


