ఇజ్రాయెల్‌ దాడుల్లో హజ్బొల్లా కీల‌క నేత హ‌తం | Hezbollah Chief Secretary Death In Beirut Strikes | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడుల్లో హజ్బొల్లా కీల‌క నేత హ‌తం

Apr 9 2026 4:14 PM | Updated on Apr 9 2026 4:51 PM

Hezbollah Chief Secretary Death In Beirut Strikes

బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. హజ్బొల్లా చీఫ్‌ పర్సనల్‌ సెక్రటరీ అలీ యూసఫ్‌ హర్షీను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ గురువారం ప్రకటించింది. రాత్రి బీరుట్‌పై జరిపిన దాడ్లుల్లో అలీ యూసఫ్‌ చనిపోయారని.. హెజ్బొల్లా ఆయుధ రవాణా మార్గాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. సౌత్‌ లెబనాన్‌లో 10 ఆయుధ డిపోలు నాశనం నాశనమైనట్లు పేర్కొంది. హర్షీ.. ఖాసిమ్‌కు అత్యంత నమ్మకస్థుడైన సలహాదారు మాత్రమే కాకుండా.. అతని కార్యాలయ నిర్వహణ, భద్రతా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేవారని తెలిపింది.

అంతకుముందు, అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న హజ్బొల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు సమాధానం ఇచ్చే హక్కు తమకు ఉందని హజ్బొల్లా పేర్కొంది. శత్రువు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతిగా.. సరిహద్దు సమీపంలోని మనారా అనే ఇజ్రాయెల్ కిబ్బట్జ్‌పై గురువారం తెల్లవారుజామున రాకెట్లతో దాడి చేశాం" అని హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది.

లెబనాన్‌పై కేవలం ఒక్క రోజులోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 254 మంది మరణించగా.. 1,165 మందికి పైగా గాయపడ్డారు. దీంతో లెబనాన్ ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మేము అటువంటి వాగ్దానం ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement