Heavy Rain At USA Tennessee Twenty Two Members Deceased: వందేళ్లలో అమెరికాలో భారీ వర్షం. - Sakshi
Sakshi News home page

వందేళ్లలో అమెరికాలో భారీ వర్షం.. 22 మంది మృతి

Aug 23 2021 1:15 PM | Updated on Aug 23 2021 4:34 PM

Heavy Rain At USA Tennessee Twenty Two Members Deceased - Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. అమెరికాలోని టెన్నెస్సీ భారీ వర్షం ధాటికి అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదల్లో వందలాది కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో మనుషులు గల్లంతయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక వందేళ్లలో అమెరికా చూసిన అత్యంత భారీ వర్షం ఇదే అంటున్నారు అధికారులు. టెన్నిస్సీలోని హంప్రీ కౌంటీలో 24 గంటల్లో 43 సెంటీమీటర్ల వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. 

(చదవండి: రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement