Google: గూగుల్‌ కీలక నిర్ణయం.. వారికి ఊరట

Google Will Not Store Abortion Clinic Visits Location Data - Sakshi

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది. గూగుల్‌ వినియోగదారులు అబార్షన్‌ క్లినిక్‌లు, గృహ హింస షెల్టర్స్‌, ప్రైవసీ కోరుకునే ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారి లోకేషన్‌ హిస్టరీనీ తొలగిస్తామని గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ ప్రదేశాల్లో ఎవరైనా వినియోగదారులు సందర్శించినట్టు తమ సిస్టమ్స్‌ గుర్తిస్తే వెంటను ఆ ఎంట్రీలను తొలగిస్తామని గూగుల్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెన్ ఫిట్జ్‌పాట్రిక్ వెల్లడించారు. రాబోయే కొన్ని వారాల్లో ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక.. సంతానోత్పత్తి కేంద్రాలు, పలు వ్యసనాల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు సంబంధించి చికిత్స తీసుకునే ప్రదేశాలు, బరువు తగ్గించే క్లినిక్స్‌కు వెళ్లిన డేటాను కూడా సేవ్‌లో ఉండదని ఆయన తెలిపారు. 

అయితే, అగ్రరాజ్యం అమెరికాలో అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మే నెలలో డెమోక్రటిక్ చట్టసభ సభ్యుల బృందం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈవో) సుందర్ పిచాయ్‌కు లేఖ రాశారు. సంతానోత్పత్తి కేంద్రాలకు వెళ్లే వారి స్మార్ట్‌ఫోన్ లొకేషన్ డేటాను బహిర్గతం చేయకుండా నిలిపివేయాలని వారు ఆ లేఖలో కోరినట్టు సమాచారం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top