అమెరికాలో గూగుల్‌పై కేసు

Google faces new antitrust lawsuit over Google Play Store - Sakshi

వాషింగ్టన్‌: ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్‌ ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’లో ఆరోగ్యకరమైన పోటీని తన విధానాల ద్వారా తోసిపుచ్చుతోందని, దేశ కాంపిటీషన్‌ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ వాషింగ్టన్‌ డీసీతో పాటు 36 రాష్ట్రాలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ‘గూగుల్‌’పై కోర్టులో కేసు వేశాయి. వ్యాపారంలో పోటీని వ్యతిరేకించే ఒప్పందాలు, విధానాలను అవలంబిస్తూ యాండ్రాయిడ్‌ వినియోగదారులకు సరైన, చవౖMðన ఉత్పత్తులు లభించకుండా చూస్తోం దని ఆరోపించాయి. న్యూయార్క్, నార్త్‌ కరోలినా, టెన్నెసీ తదితర రాష్ట్రాలు గూగుల్‌పై ఈ దావా వేశాయి.

యాప్‌ డెవలపర్లు వారి డిజిటల్‌ కంటెంట్‌ను గూగుల్‌ ప్లే సోర్ట్‌లో కొనుగోలు చేసిన యాప్‌ల ద్వారా, గూగుల్‌ మధ్యవర్తిగా మాత్రమే అమ్మాలని నిర్దేశిస్తోందని, తద్వారా వారి నుంచి గూగుల్‌ కమిషన్‌ సహా పెద్ద ఎత్తున ఆదాయం సముపార్జిస్తోందని ఆయా రాష్ట్రాలు ఆరోపిం చాయి. ‘చాన్నాళ్లుగా ఇంటర్నెట్‌కు గేట్‌కీపర్‌గా గూగుల్‌ వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడు మన డిజిటల్‌ డివైజెస్‌కు గేట్‌ కీపర్‌గా మారింది. తద్వారా మనం రోజూ వాడే సాఫ్ట్‌వేర్‌ను ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. తన ఆధిక్యతను ఆసరాగా తీసుకుని పోటీని అక్రమంగా అణచివేస్తోంది. పోటీకి నిలిచిన థర్డ్‌ పార్టీ యాప్‌ డెవలపర్ల చిన్న,చిన్న వ్యాపారాలను తొక్కేస్తోంది’ అని న్యూయార్క్‌ అటార్నీ వ్యాఖ్యానించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top