దొంగకే జాబ్ ఆఫర్ చేసిన రెస్టారెంట్‌ యజమాని

Georgia restaurant owner offers job to burglar who stole cash register - Sakshi

జార్జియా: అమెరికాలోని జార్జియాలో ఉన్న ఓ రెస్టారెంట్‌ యజమాని కార్ల్ వాలెస్‌ తాళం కాదు ఏకంగా జాబే ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దీ రోజుల క్రితం ఓ తెల్లవారు జామున 4 గంటలకు ఓ దొంగ అద్దాలు పగలగొట్టి లోపలికి దూరాడు. అయితే అతనికి ఏమీ దొరక్క అక్కడే ఉన్న క్యాష్‌ బ్యాక్సు ఎత్తుకెళ్లాడు. వాడో తింగరోడులాగున్నాడు ఎందుకంటే అది ఖాళీదట. ఉదయాన్నే రెస్టారెంట్‌కు వచ్చిన ఆ యజమానికి ముందు విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత అతన్ని చూసి విపరీతమైన జాలీ వేసింది. 

పాపం అతనికి ఎంత కష్టం వచ్చిందో, అందుకే చివరకు క్యాష్‌ లేని బాక్సు కూడా ఎత్తుకెళ్లాడని చెబుతూ ‘నాయనా మా రెస్టారెంట్‌లో జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకో జాబ్ ఇస్తాను. నువ్వే చేసే దొంగతనం కన్నా ఇది చాలా మంచి పనేగా’ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. పోలీసులకు భయపడి రాడేమో అని ఫిర్యాదు కూడా ఇవ్వను అని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్టుకు నెటిజన్ల నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ తింగరి దొంగ మాత్రం స్పందించనేలేదట.

చదవండి: వాట్సాప్‌ వినియోగదారులకి సీఈఆర్‌టీ హెచ్చరిక

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top