అమెరికాలో కారు ప్రమాదం.. మధు యాష్కీ సతీమణికి తీవ్ర గాయాలు | Former MP Madhu Yaskhi Wife Injured in US Car Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో కారు ప్రమాదం.. మధు యాష్కీ సతీమణికి తీవ్ర గాయాలు

Jun 3 2026 7:46 PM | Updated on Jun 3 2026 8:00 PM

Former MP Madhu Yaskhi Wife Injured in US Car Accident

వాషింగ్టన్‌: అమెరికాలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ సతీమణి సీనియర్‌ డాక్టర్‌ సుచీయాష్కీకి తీవ్రగాయాలయ్యాయి. మధుయాష్కీ దంపతుల కుమార్తె డాక్టర్‌ గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్‌ చేయించి బోస్టన్‌ నుంచి న్యూయార్క్‌కు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. కారులో లగేజీ ఎక్కువ కావడంతో మధుయాష్కీ గౌడ్‌, సుచీయాష్కీలు వేర్వేరు కార్లలో ప్రయాణిస్తున్నారు.

అయితే మార్గం మధ్యలో భారీ వర్షం కారణంగా సుచీ యాష్కీ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుచీయాష్కీకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుచీయాష్కీ కోలుకుంటున్నారని సమాచారం. కాగా, అమెరికా పర్యటన ముగించుకొని రేపు మధుయాష్కీ దంపతులు భారత్‌కు రావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement