మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!

Egypt Digitally Unwraps Mummy Of Famed Pharaoh Amenhotep I - Sakshi

ఈజిప్ట్‌ మమ్మిలు గురించి మనం కథలు కథలుగా విన్నాం. సినిమాల్లో చూశాం. అయితే శాస్త్రవేత్తలు వాటి గురించి పరిశోధనలు చేయాలంటే కచ్చితంగా చేతులతో తాకక తప్పదు. పైగా వాటిని ప్రత్యేక ద్రావణాలతో పూసి చుట్టేవారు. దీంతో వారికి ఇదంతా చాలా శ్రమతో కూడిన పనిగా ఉండేది. ఇక ఆ సమస్య ఉండదంటున్నారు. పైగా మమ్మీలను టచ్‌ చేయకుండానే సరికొత్త సాంకేతికత కొత్త మమ్మీఫికేషన్(మమ్మీల పుట్టు పూర్వోత్తరాలు) పద్ధతులను కనుగొన్నారు. 

(చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్‌లో ‘హలో వరల్డ్‌’ ట్వీట్‌! ఎలాగంటే..)

అసలు విషయంలోకెళ్లితే.... 1881లో కనుగొన్న ఈజిప్‌​ ప్రఖ్యాత ఫారో అమెన్‌హోటెప్ I మమ్మీ చరిత్రను డిజిటల్‌ సాంకేతికత సాయంతో దాని రహస్యలను చేధించారు. అంతేకాదు ఆ మమ్మీ సమాధికి ఎలాంటి భంగం కలిగించకుండా అధునాతన డిజిటల్ త్రీడీ ఇమేజరీ సాయంతో పరిశోధకులు కొత్త మమ్మీఫికేషన్ పద్ధతులను కనుగొన్నారు. పైగా కైరో యూనివర్శిటీలో రేడియాలజీ ప్రొఫెసర్ సహర్ సలీమ్,  ప్రసిద్ధ ఈజిప్టు శాస్త్రవేత్త జాహి హవాస్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.

ఈ మేరకు ప్రొఫెసర్ సలీమ్, హవాస్‌ మమ్మీని అమెన్‌హోటెప్ I మమ్మీని అధునాతన ఎక్స్-రే టెక్నాలజీ సీటీ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కానింగ్ చేసి తాకాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో డిజిటల్‌గా మార్చే అధునాతన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించారు. ఈ పరిశోధనలో తొలిసారిగా రాజు అమెన్‌హోటెప్ I ముఖం, వయసు,ఆరోగ్య పరిస్థితి సంబంధించిన మమ్మిఫికేషన్‌ రహస్యలను వెల్లడించింది.

అంతేకాదు  ఆయుధాలతో మమ్మీగా చేయబడిన మొదటి ఫారో అమెన్‌హోటెప్ I అని పేర్కొంది. పైగా అతని మెదడు పుర్రె నుండి తొలగించలేదని తెలిపింది. పైగా ఈ మమ్మీ క్రీస్తూ పూర్వం 1500ల క్రితం నాటిదని, తన 21 సంవత్సరాల పాలనలో అనేక సైనిక ప్రచారాలను నిర్వహించిన ఫారో, 35 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో మరణించినట్లు వెల్లడించింది.

(చదవండి: లైవ్‌లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top