వైరల్‌: స్కేటింగ్‌‌ అదరగొట్టిన కుక్క పిల్ల

Dog Skateboard On A Street Video Trending In Social Media - Sakshi

కొన్ని ఆటల్లో మనుషుల కంటే జంతువులే తమ ప్రతిభను చాలా చక్కగా కనబరుస్తాయనడంలో సందేహం లేదు. సాధారణంగా మనుషులు స్కేటింగ్‌ చేస్తేనే.. ఎక్కడో ఒక చోటు బ్యాలన్స్ తప్పి పడుతూ, లేస్తూ ముందుకు వెళ్లుతారు. అలాంటిది ఓ కుక్క పిల్ల రోడ్డుపై చేసిన స్కేటింగ్‌ వీడియోను చూస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ప్రస్తుతం ఆ కుక్క పిల్ల చేసిన స్కేటింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మరింది. ఈ వీడియోను అమెరిక‌న్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ తన ట్వీటర్ ఖాతాలో‌ షేర్‌ చేశారు. ‘స్కేటర్‌ గుడ్‌ బాయ్‌...’అని కాప్షన్‌ జతచేశారు. ఆ కుక్క పిల్ల స్కేటింగ్‌ బోర్డుపై నిలబడి రోడ్డుపై దర్జాగా స్కేటింగ్‌ చేస్తూ ఉంటే దాన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు.

ఆ చిన్న కుక్కపిల్ల చాలా సులువుగా చేస్తున్న స్కేటింగ్‌ రోడ్డుపై ఉన్న కొందరిలో నవ్వులు పూయించింది. అది రోడ్డు మీద ఉన్న ఓ మూల మలుపును కూడా చాలా చక్కగా దాటుకుంటూ మరో రోడ్డుపైకి వెళ్తుతుంది. చాలా దూరం స్కేటింగ్‌ చేసిన కుక్క ఒకసారి స్కేటింగ్‌ బోర్డు దిగి అదే హుషారుతో మళ్లీ స్కేటింగ్‌ చేస్తుంది. ఈ క్రేజీ వీడియోను ఇప్పటికే సుమారు ఆరు లక్షల మంది వీక్షించగా, పదివేల లైక్‌లు, రెండు వేల రీ ట్వీట్లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ కుక్క పిల్ల నాకుంటే చాలా ప్రశాంతంగా స్కేటింగ్‌ చేస్తోంది’అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘ఓ మై గాడ్‌.. చాలా అద్భుతం’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top