చేపను పట్టి వేలం వేస్తే.. రెండు కోట్లకు పైగా వచ్చింది! ప్రత్యేకత ఏంటంటే..

Did You Know Why Japan Bluefin Tuna Sold For Huge Amount - Sakshi

ఇది బ్లూఫిన్‌ టూనా చేప. బరువు 212 కిలోల దాకా ఉంటుంది. గురువారం జపాన్‌ రాజధాని టోక్యోలోని టొయొసు మార్కెట్‌లో జరిగిన వేలంలో 36 మిలియన్‌ యెన్‌లు(  2,73,000 డాలర్లు).. అంటే రూ.2.25 కోట్లు పలికింది. ఆవోమోరిలోని ఒమా దగ్గర ఈ చేపను పట్టుకున్నారు.  

భారీ సైజులో ఉండే బ్లూఫిన్‌ టూనా చేప పట్టుకుని.. వేలం వేయడం ప్రతీ ఏడాది ఆనవాయితీగా వస్తోంది. 1999 నుంచి ఇది అరో గరిష్ఠ ధర.  కిందటి ఏడాది 210 కేజీల దాకా బరువు ఉన్న చేపను వేలం వేస్తే.. 2,02,000 డాలర్లు వచ్చింది. 2020లో దాదాపు 300 కేజీల దాకా బరువు ఉన్న చేపను 1.8 మిలియన్‌ డాలర్లకు, ఇక 2019లో కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 3.1 మిలియన్‌ డాలర్లకు బ్లూఫిన్‌ చేప వేలంలో అమ్ముడు పోయింది. కరోనా ప్రభావంతోనే చేప రేటు పడిపోతూ వస్తోందని భావిస్తున్నారు. 

ఒమా బ్లూఫిన్ టూనాను.. బ్లాక్‌ డైమండ్స్‌గా వ్యవహరిస్తారు. ఈ భారీ చేపలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. అందుకే అంతలా రేటు ఉంటుంది. జపనీస్‌ సూషీ చెయిన్‌ అయిన ‘సూషీ జన్మాయ్‌’ అధ్యక్షుడు కియోషి కిమురా ప్రతీ ఏడాది కొత్త సంవత్సరంలో ఆనవాయితీగా ఈ వేలం నిర్వహిస్తు వస్తున్నారు. అయితే.. ఈ ఏడాది మాత్రం లూక్సే సుషీ జింజా ఒనోడెరా చెయిన్‌ ఓనర్‌ అయిన హిరోషి ఓనోడెరా నిర్వహించారు. ఓమోటెసాండో జిల్లాలోని ఓనోడెరా రెస్టారెంట్‌లో దీన్ని వండి వడ్డిస్తారు.  దేశంలోని అగ్రశ్రేణి చెఫ్‌లు మాత్రమే దీనిపై తమ పనితనం ప్రదర్శిస్తారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top