ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో  షాక్‌!

Denmark Norway Iceland Suspend Use Of AstraZeneca Covid Vaccine - Sakshi

టీకా వినియోగం తాత్కాలికంగా నిలిపివేసిన మూడు ఈయూ దేశాలు

పెరుగుతున్న రక్తం గడ్డ కడుతున్న కేసులు

సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వినియోగంపై  వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  కరోనా వైరస్‌ నివారణకు గాను వాక్సీన్‌ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో  టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తాజాగా డెన్మార్క్‌, నార్వే, ఐస్‌లాండ్‌ దేశాలు గురువారం ప్రకటించాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు  డెన్మార్క్‌  ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 

డెన్మార్క్‌లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్‌తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వీటిని మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు.అందుకే వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు. (అమెరికన్ల జీవితాలు మారుతాయ్‌!)

మార్చి 9 నాటికి యూరోపియన్‌ ఎకనామిక్‌ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్‌ మెడిసన్స్‌ ఏజెన్సీ (ఇఎంఎ) తెలిపింది. అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కారణంగా ఆస్ట్రియా  నర్సు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీకా తీసుకున్న తరువాత  ఆమె తీవ్రమైన రక్త గడ్డంకట్టే సమస్యతో చనిపోవడంతో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీంతో నాలుగు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా, లక్సంబర్గ్‌లు కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో  డెన్మార్క్‌ నార్వే, ఐస్‌లాండ్‌ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార‍్హం​. (కోవిడ్‌ ముప్పు తొలగిపోలేదు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top