కరోనా సోకినా.. వీల్‌ ఛైర్‌పై ప్రమాణస్వీకారానికి హాజరై!

Czech President Appointed New PM From Glass Box Over He Got Covid Positive - Sakshi

పరాగ్వే: కరోనా వైరస్‌ సోకితే వెంటనే వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్‌లోకి వెళుతాము. అయితే కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్న చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ మాత్రం.. ప్రత్యేక పరిస్థితుల్లో దేశ నూతన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రెసిడెంట్‌ మిలోస్‌ జెమాన్‌.. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గాజు బాక్స్‌లోకి వీల్‌ఛైర్‌ మీద వచ్చి పీటర్ ఫియాలా చేత ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించారు.

చదవండి: Omicron: పెను ముప్పు.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచనలు

ఎన్నికల్లో పీటర్‌ ఫియాలా నేతృత్వంలోని సెంటర్-రైట్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అధ్యక్షుడు మిలోన్‌.. అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. కోవిడ్‌ సోకినట్లు నిర్థారణ అయింది.

చదవండి:  చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్‌లో ప్రవేశం

ఇక కొత్త ప్రధాని ఫియాలా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతికుల సవాళ్లు ఎదుర్కొనే గడ్డు కాలంలో ఉందని తెలిపారు. అయితే భవిష్యత్తులో తమ ప్రభుత్వం దేశంలో మార్పు తీసుకువస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు. కరోనా కాలంలో సేవలందించిన వ్యైదులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top