జలరాకాసి నోట చిక్కి.. తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..

Costa Rica Killer Crocodile: Kid Remains Recovered After Month - Sakshi

శాన్‌ జోస్‌: అభం శుభం తెలియని ఓ చిన్నారి.. జలరాకాసి నోట చిక్కి దారుణ స్థితిలో ప్రాణం కోల్పోయాడు. అదీ అంతా చూస్తుండగానే!. కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయి.. కడసారి చూపు కోసం బిడ్డ శవం కూడా దొరక్క తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అయితే తాజాగా ఈ విషాదంలో మరో పరిణామం చోటు చేసుకుంది. 

కోస్టారికా లిమన్‌ నగరంలో నెల కిందట ఘోరం జరిగింది. బటినా నది దగ్గర కుటుంబం, బంధువులతో పాటు చేపల వేటకు వెళ్లిన ఓ చిన్నారిని.. 12 అడుగుల భారీ మొసలి నోటి కర్చుకుని నీళ్లలోకి లాక్కెల్లే యత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆ చిన్నారి తల తెగిపడడంతో.. అక్కడున్నవాళ్లంతా షాక్‌తో కేకలు వేశారు. తలతో పాటు అక్కడి నుంచి నీళ్లలోకి వెళ్లిపోయింది ఆ మొసలి. అక్కడున్నవాళ్లంతా ఆ పరిణామం నుంచి తేరుకునేలోపే.. నిమిషాల వ్యవధిలో మళ్లీ వెనక్కి వచ్చిన మొసలి.. ఈసారి బాలుడి మొండెంను లాక్కెల్లింది.

ఈ హఠాత్‌ పరిణామంతో ఆ పేరెంట్స్‌ రోదనలు మిన్నంటయ్యాయి. స్థానిక అధికారులు బాలుడి శరీరాన్ని రికవరీ చేసే యత్నం చేసి.. విఫలం అయ్యారు. బాధితుడిని ఎనిమిదేళ్ల జూలియో ఒటేరియో ఫెర్నాండేజ్‌గా గుర్తించారు.  అక్టోబర్‌ 30వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఇది జరిగి దాదాపు నెల తర్వాత.. మొన్న శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వేటగాడు ఒటినా నదిలో పశువుల మీద దాడికి వచ్చిన ఓ మొసలిని కాల్చి చంపాడు. స్థానికులు దానిని ఒడ్డుకు లాక్కొచ్చి పొట్ట చీల్చి చూడగా.. కడుపులో మనిషి జుట్టుతో పాటు ఎముకల శకలాలు బయటపడ్డాయి. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా.. అవి ఎనిమిదేళ్ల చిన్నారి జూలియోకు చెందినవే అని తేల్చారు. దీంతో ఆ మృత శకలాలను జూలియో తల్లిదండ్రులకు అప్పగించారు.  

 ‘‘ఆరోజు మధ్యాహ్న సమయంలో మోకాళ్ల నీతులో జూలియో ఉన్నాడు. కాస్త దూరంలో అతని అన్నదమ్ములు, ఇతర బంధువులు ఉన్నారు. చూస్తుండగానే ఓ మొసలి వచ్చి వాడ్ని లాక్కెళ్లింది. తల తెగి పడడంతో తల్లి మార్గిని ఫ్లోరెస్‌ కుప్పకూలిపోయింది. మళ్లీ నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి మొండెం భాగాన్ని తీసుకెళ్లింది. అక్కడ ఉన్న గుహల్లోకి వెళ్లిపోయింది. అక్కడ చాలా మొసళ్లు ఉన్నాయి. అందుకే శవాన్ని రికవరీ చేయలేకపోయాం’’ అని అధికారులు వెల్లడించారు. మొసళ్ల జోన్‌గా ఆ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినప్పటికీ.. కొంత మంది జాలర్ల అక్రమ వేటతో అక్కడున్న వార్నింగ్‌ ఫెన్సింగ్‌లు తొలగించారని, దీంతోనే  చిన్నారి ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి: లవర్‌పై అనుమానంతో ఏకంగా.. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top