breaking news
gruesome photo
-
తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..
శాన్ జోస్: అభం శుభం తెలియని ఓ చిన్నారి.. జలరాకాసి నోట చిక్కి దారుణ స్థితిలో ప్రాణం కోల్పోయాడు. అదీ అంతా చూస్తుండగానే!. కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయి.. కడసారి చూపు కోసం బిడ్డ శవం కూడా దొరక్క తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అయితే తాజాగా ఈ విషాదంలో మరో పరిణామం చోటు చేసుకుంది. కోస్టారికా లిమన్ నగరంలో నెల కిందట ఘోరం జరిగింది. బటినా నది దగ్గర కుటుంబం, బంధువులతో పాటు చేపల వేటకు వెళ్లిన ఓ చిన్నారిని.. 12 అడుగుల భారీ మొసలి నోటి కర్చుకుని నీళ్లలోకి లాక్కెల్లే యత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆ చిన్నారి తల తెగిపడడంతో.. అక్కడున్నవాళ్లంతా షాక్‌తో కేకలు వేశారు. తలతో పాటు అక్కడి నుంచి నీళ్లలోకి వెళ్లిపోయింది ఆ మొసలి. అక్కడున్నవాళ్లంతా ఆ పరిణామం నుంచి తేరుకునేలోపే.. నిమిషాల వ్యవధిలో మళ్లీ వెనక్కి వచ్చిన మొసలి.. ఈసారి బాలుడి మొండెంను లాక్కెల్లింది. ఈ హఠాత్ పరిణామంతో ఆ పేరెంట్స్ రోదనలు మిన్నంటయ్యాయి. స్థానిక అధికారులు బాలుడి శరీరాన్ని రికవరీ చేసే యత్నం చేసి.. విఫలం అయ్యారు. బాధితుడిని ఎనిమిదేళ్ల జూలియో ఒటేరియో ఫెర్నాండేజ్గా గుర్తించారు. అక్టోబర్ 30వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఇది జరిగి దాదాపు నెల తర్వాత.. మొన్న శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వేటగాడు ఒటినా నదిలో పశువుల మీద దాడికి వచ్చిన ఓ మొసలిని కాల్చి చంపాడు. స్థానికులు దానిని ఒడ్డుకు లాక్కొచ్చి పొట్ట చీల్చి చూడగా.. కడుపులో మనిషి జుట్టుతో పాటు ఎముకల శకలాలు బయటపడ్డాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా.. అవి ఎనిమిదేళ్ల చిన్నారి జూలియోకు చెందినవే అని తేల్చారు. దీంతో ఆ మృత శకలాలను జూలియో తల్లిదండ్రులకు అప్పగించారు. ‘‘ఆరోజు మధ్యాహ్న సమయంలో మోకాళ్ల నీతులో జూలియో ఉన్నాడు. కాస్త దూరంలో అతని అన్నదమ్ములు, ఇతర బంధువులు ఉన్నారు. చూస్తుండగానే ఓ మొసలి వచ్చి వాడ్ని లాక్కెళ్లింది. తల తెగి పడడంతో తల్లి మార్గిని ఫ్లోరెస్ కుప్పకూలిపోయింది. మళ్లీ నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి మొండెం భాగాన్ని తీసుకెళ్లింది. అక్కడ ఉన్న గుహల్లోకి వెళ్లిపోయింది. అక్కడ చాలా మొసళ్లు ఉన్నాయి. అందుకే శవాన్ని రికవరీ చేయలేకపోయాం’’ అని అధికారులు వెల్లడించారు. మొసళ్ల జోన్‌గా ఆ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినప్పటికీ.. కొంత మంది జాలర్ల అక్రమ వేటతో అక్కడున్న వార్నింగ్ ఫెన్సింగ్‌లు తొలగించారని, దీంతోనే చిన్నారి ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇదీ చదవండి: లవర్‌పై అనుమానంతో ఏకంగా.. -
నరికిన తలతో.. కుర్రాడి ఫొటో పోజు!!
ఉగ్రవాదుల ఘాతుకాలు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి. సిరియా సైనికుడి తల నరికేసి.. ఆ తలను ఓ కుర్రాడి చేతికి ఇచ్చి ఫొటో తీశారు. ఆ కుర్రాడు కూడా.. ఓ ఆస్ట్రేలియా ఉగ్రవాది కొడుకు కావడం గమనార్హం. ఈ ఫొటోను ఆస్ట్రేలియా దినపత్రిక ఒకటి ప్రచురించింది. దీన్ని బట్టే ఉగ్రవాదులు ఎంత అరాచకంగా ఉన్నారో అర్థమవుతుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. ఖలీద్ షరౌఫ్ అనే ఉగ్రవాది కొడుకు ఈ తల పట్టుకున్నట్లుగా ఉన్న ఫొటోను ముందుగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా పత్రిక ప్రచురించింది. అతడు తన కొడుకేనని షరౌఫ్ కూడా గర్వంగా చెప్పాడు. సిరియా ఉత్తర భాగంలోని రక్కా ప్రాంతంలో ఆ ఫొటో తీశారు. దీన్ని ఇస్లామిక్ స్టేట్ రాజధానిగా ఇస్లామిక్ ఖలీఫా ప్రకటించుకున్నారు. పేరు బయటకు రాని ఆ కుర్రాడి వయసు పదేళ్లలోపే. ఉగ్రవాది షరౌఫ్ తన సోదరుడి పాస్‌పోర్టు ఉపయోగించుకుని భార్య, ముగ్గురు కొడుకులతో కలిసి సిరియా, ఇరాక్ దేశాలకు గత సంవత్సరమే పారిపోయాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడిని దేశం వదిలి వెళ్లకూడదని నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ అతడిపై ఆస్ట్రేలియన్ పోలీసులు అరెస్టు వారెంటు కూడా జారీ చేశారు.