Cockroach beer: పేరే కాదు, ఆ టేస్టే వేరంటున్న బీర్‌ ప్రియులు

Cockroach beer:Do you know Japan is made from this insect? - Sakshi

బీర్‌ను సాధారణంగా బార్లీ గింజలు, హోప్‌ మొక్కనుంచి వచ్చే పువ్వులు, ఒక్కోసారి గోధుమలతోను తయారు చేస్తారని మనలోచాలామందికి తెలుసు కదా. ఈ మధ్య గ్లూటెన్‌ ఫ్రీ అంటూ జొన్నలతో కూడా బీర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా వెరైటీ బీరు ఒకటి హల్‌ చల్‌ చేస్తోంది. అదే కాక్రోచ్‌ బీర్‌.. మీరు విన్నది నిజమే. బొద్దింకల బీర్‌. కానీ ఇది ఎక్కడ పడితే దొరకదు సుమా! మరి ​ఈ స్పెషల్‌ బీర్‌  ఎక్కడ తయారవుతుంది. దీని రేటెంత? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి.

బార్లీ గంజిని పులియబెట్టి, ప్రాసెస్‌ చేసి  బీరు తయారు చేస్తారు. ఆయా బ్రాండ్లు వీటికి కొన్ని ప్లేవర్లను యాడ్‌ చేస్తాయి. కానీ జపాన్‌లో మాత్రం బీరును ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే..ముందు యాక్‌ అంటారు. కానీ టేస్ట్‌కు టేస్ట్‌.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ జపాన్‌ వాసులు  ఈ స్పెషల్‌ బీర్‌ కోసం ఎగబడతారట.  20వ శతాబ్దం ప్రారంభం నుండి  ఈ బీర్‌ను  ఎంజాయ్‌ చేస్తున్నారట  అక్కడి మందుబాబులు. 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top