గనిలో అగ్ని ప్రమాదం | Coal mine fire in Kazakhstan kills workers | Sakshi
Sakshi News home page

గనిలో అగ్ని ప్రమాదం

Oct 29 2023 5:53 AM | Updated on Oct 29 2023 5:53 AM

Coal mine fire in Kazakhstan kills workers - Sakshi

లండన్‌: కజఖిస్తాన్‌లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్‌ మిట్టల్‌ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది.

మీథేన్‌ గ్యాస్‌ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్‌ ఉత్పత్తిదారు ఆర్సెలర్‌ మిట్టల్‌. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్‌లో ఆర్సెలర్‌ మిట్టల్‌ టెమిర్టౌ పనిచేస్తుంది.  ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్‌ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్‌ మిట్టల్‌ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement