వివాహం కాకపోయినా పర్లేదు!.. పిల్లలను కనండి అంటున్న చైనా!

Chinas Sichuan Frees Unmarried People To Legally Have Children - Sakshi

పెళ్లి కానీ వారు ఎవరైనా తమ కుటుంబాన్ని పెంచుకోవాలనుకుంటే ఓకే అని డ్రాగన్‌ కంట్రీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంతకు మునుపు కేవలం వివాహిత జంటలు మాత్రమే చట్టబద్ధంగా పిల్లలను కనేలా అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు పెళ్లి కాకపోయినా పర్వాలేదు చట్టబద్ధంగా పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తోంది చైనా. ఎందుకంటే అక్కడ ఘోరంగా జననాల రేటు పడిపోవటంతో దాన్ని పెంచే క్రమంలో  ఇలా ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. అలాగే చైనాలోని నైరుతీ ప్రావిన్స్‌లో సిచువాన్‌ ఐదవ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం.

ఐతే ఈ ప్రాంతం 60 ఏళ్ల కంటే పైబడినవారి పరంగా ఏడో స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో వివాహాలు, జననాల రేటు పడిపోవడంతో ఈ నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు చైనా ఫిబ్రవరి 15  నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. వివాహిత జంటలే గాక పిల్లలను కావాలనుకునే వారంతా అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకుని కోరుకున్నంత మంది పిల్లలని కనొచ్చని చెప్పింది.

చైనా జనాభా ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా తగ్గిపోయింది. దీన్ని చారిత్రాత్మక మలుపుగా పేర్కొనవచ్చు. ఈ మేరకు సిచువాన్‌ ఆరోగ్య కమిషన్‌ దీర్ఘకాలిక సమతుల్య జనాభాను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జనాభాను పెంచేలా ప్రజలకు మరిన్ని ప్రోత్సహాకాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వైద్య బిల్లులు కవర్‌ అయ్యేలా ప్రసూతి బీమా, ప్రసూతి సెలవుల సమయంలో జీతాన్ని అందించేలా వెసులబాటు వంటి తదితర ప్రోత్సహాకాలను అందించారు. ఇది ఒంటరిగా జీవించే మహిళలకు, పురుషులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. 
(చదవండి: అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి)
 

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top