కుక్క పిల్ల అని పెంచితే.. రెండేళ్ల తర్వాత నిజం తెలిసి షాకయ్యారు!

China: Family Mistakes Bear For A Dog, Raises It As Their Pet For Two Years - Sakshi

చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకోవడం చూస్తూనే ఉంటాం. ఇక కొందరైతే వాటిని తమ ఇళ్లలోని మనుషులులానే భావిస్తారు. ఇదంతా షరా మామూలే.  చైనాలోని ఓ కుటుంబం కూడా ఓ కుక్క పిల్లను రెండేళ్లు అల్లారుముద్దుగా పెంచుకుంది. కానీ పెద్దయ్యాక దాన్ని అసలు రంగు బయటపడింది. నిజం తెలియగానే కుటుంబమంతా షాక్‌లో ఉండిపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్ నగరం వెలుపల ఉన్న మారుమూల గ్రామానికి చెందిన సు యున్ అనే మహిళ, 2016లో విహారయాత్రలో వెళ్లి ఓ  కుక్కపిల్లని తన ఇంటికి తీసుకెళ్లింది .ఆ కుక్కపిల్ల చూసేందుకు పెద్దదిగా, కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆ మహిళ అవేవి పట్టించుకోలేదు. అయితే అది పెరిగేకొద్దీ, దాని ప్రవర్తన కుక్కలా కాకుండా వింతగా ప్రవర్తించేది. అలా రెండేళ్ల గడిచింది ఆ తర్వాత ఆ కుక్క పిల్ల బలంగా తయారై క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.

దీంతో ఆ మహిళకు అనుమానం రావడంతో జంతువులకు సంబంధిత అధికారులను సంప్రదించింది. ఆమె అనుమానాలను నిజం చేస్తూ, ఆ మహిళ ఇంట్లో పెంచుకుంటున్న జంతువు ఆసియాటిక్ బ్లాక్ బేర్ అని, అంతరించిపోతున్న జాబితాలో ఉన్న జాతికి చెందిన ఎలుగుబంటని తేలింది.  దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. తత్ఫలితంగా, యునాన్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ విభాగం ఆ జంతువును స్వాధీనం చేసుకుంది. 2018లో తొలిసారిగా వైరల్‌గా మారిన ఈ వింత కథనం.. అయితే తాజాగా మళ్లీ ఆ వార్త వైరల్‌గా మారింది.

చదవండి: టికెట్‌ బుకింగ్‌ సమయంలో షాక్‌.. ఐఆర్‌సీటీసీపై యూజర్లు ఫైర్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top