10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం

China This 10 Storey Building Was Constructed In Just Over A Day - Sakshi

చైనా బ్రాడ్‌ కంపెనీ రికార్డ్‌

ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీతో నిర్మాణం పూర్తి

బీజింగ్‌: మాములుగా ఓ చిన్న గది నిర్మణానికే రోజుల సమయం పడుతుంది. అలాంటిది ఇల్లు, బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎంత లేదన్న నెలలు, సంవత్సరాల సమయం పడుతుంది. చేతిలో డబ్బు, మెటిరీయల్‌ అన్ని సిద్ధంగా ఉన్నప్పటికి నిర్మాణం పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. అలాంటిది ఓ చోట మాత్రం 10 అంతస్తుల నిర్మాణాన్ని కేవలం 28 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. అయితే అదేదో సినిమా సెట్టు లాంటి నిర్మాణం అనుకుంటే పొరపడినట్లే. మనుషులు నివసించే అపార్ట్‌మెంట్‌ను కేవలం 28 గంటల్లో నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు..

చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్‌ గ్రూప్‌ కంపెనీ ఈ రికార్డును సృష్టించింది. ఈ పది అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం కోసం బ్రాడ్‌ కంపెనీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌(ముందుగా నిర్మించిన) కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 28 గంటల వ్యవధిలో 10 అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు. దీనిలో భాగంగా ఫ్యాక్టరీలో ముందుగానే నిర్మించిన చిన్న విభాగాలను సమీకరించడం ద్వారా నిర్మాణం పూర్తి చేస్తారు. 

ఇక ఈ 10 అంతస్తుల భవనం నిర్మాణం కోసం ముందుగానే నిర్మించించిన కంటైనర్‌ సైజ్‌ బ్లాక్స్‌ను తీసుకువచ్చి.. వాటన్నింటిని ఒకదాని మీద ఒకటి పేర్చి.. బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత బోల్ట్స్‌ బిగించి.. వాటర్‌, కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఇక ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: 5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top