విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.. ఎందుకు ఆ పని చేశాడో తెలియదు. కానీ, ఆ నేరానికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు. అమెరికాలోని చికాగో విమానాశ్రయంలోకి ఈ ఘటన జరిగింది.
రన్‌వే మీద దిగుతున్న విమానం ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి రెక్కమీదకు వెళ్లాడు ఆ వ్యక్తి. అతన్ని శాన్ డియాగోకు చెందిన రాండీ ఫ్రాంక్ (57)గా గుర్తించారు.‘‘విమానం రన్‌వేపై దిగి గేటు వద్దకు వస్తుండగా అతను హఠాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కమీదకు వెళ్లాడు. కిందకు జారి ఎయిర్‌ఫీల్డ్ మీదకు దిగాడు’’ అని చికాగో పోలీసులు తెలిపారు. సర్కస్ ఫీట్‌తో రిస్క్ చేఏసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు అతను.
ఇదిలా ఉంటే.. 2020లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ విమానం ల్యాండ్ అయ్యే టైంలో ఓ మహిళ ప్యాసింజర్.. ఉక్కపోస్తోందంటూ ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి రెక్కల మీదకు వెళ్లి గాలిని పీల్చుకుంది. అయితే ఆమె మద్యం, డ్రగ్స్ మత్తులో అలా చేసిందనుకున్న పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. అలాంటిదేం లేదని తేలింది.
@fly2ohare guy jumps out of my plane before we get to the gate. @united UA2478 pic.twitter.com/xgxRszkBfH
— MaryEllen Eagelston (@MEEagelston) May 5, 2022