తల్లి ప్రాణాలు కాపాడటానికి పిల్లాడు.. | Sakshi
Sakshi News home page

తల్లి ప్రాణాలు కాపాడటానికి పిల్లాడు..

Published Fri, Aug 28 2020 2:52 PM

Boys Quick Thinking Saves Mother Life In London - Sakshi

లండన్‌ : ఓ ఐదేళ్ల కుర్రాడి చురుకైన ఆలోచన అతడి తల్లి ప్రాణాలు కాపాడటమే కాకుండా అతన్నో ఇంటర్‌నెట్‌ సెలబ్రెటీని చేసేసింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌ మెర్సియాకు చెందిన జోస్‌ అనే బాలుడి తల్లి బుధవారం స్పృహ తప్పి పడిపోయింది. ఇది గమనించిన జోష్‌ మెదడు పాదరసంలా పనిచేసింది. ఆ వెంటనే తన బొమ్మ అంబులెన్స్‌ మీద ఉన్న అత్యవసర సేవల నెంబర్‌ 112కు ఫోన్‌ చేశాడు. దీంతో ఆఘమేఘాల మీద అక్కడకు చేరుకున్న అంబులెన్స్..‌ పిల్లాడి తల్లిని ఆసుపత్రికి చేర్చింది. దీనిపై స్పందించిన టెల్‌ ఫోర్డ్‌ పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ అంత చిన్న పిల్లాడు అంత గొప్పగా ఆలోచించటం అద్భుతం. తల్లికి ఏమవుతుందోనన్న భయంతో అతడు చురుగ్గా ఆలోచించి 112కు ఫోన్‌ చేశాడు. ( ఇదేం పిచ్చి: చెవుల‌ను క‌త్తిరించి భ‌ద్రంగా..)

జోష్‌ చాలా ధైర్యవంతుడు, మేము అక్కడికి అంబులెన్స్‌ను తీసుకెళ్లి అతడి తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లేంతవరకు చాలా ఓర్పుగా ఉన్నాడు. అతడో గొప్ప పోలీస్‌ ఆఫీసర్‌ అవుతాడని నిరూపించాడు. అతడు పెద్దయ్యాక పోలీస్‌ జాబ్‌లోకి తీసుకుంటాం’’ అని చెప్పాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ వెస్ట్‌ వెర్సియా పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. జోష్‌తో దిగిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. ( జూమ్‌ లైవ్‌లో ప్రభుత్వ అధికారి శృంగారం..)

Advertisement
Advertisement