ముందు చెవులు కత్తిరించాడు, తర్వాత ముక్కు!

బెర్లిన్: ఆయనో ఆర్టిస్ట్. కళ అంతులేనిది అంటారు కదా, ఇతని కళా ప్రదర్శనకు కూడా అంతు లేకుండా పోతోంది. అదేంటో, ఎందుకో చదివేయండి.. జెర్మనీకి చెందిన సాండ్రో టాటూ ప్రియుడు. తన శరీరంపై రకరకాలుగా పచ్చబొట్టు వేయించుకున్నా అతనికి ఇంకా సంతృప్తి కలగలేదు. బొమ్మతో ఆడుకున్నట్టుగా శరీరాన్ని నచ్చిన రీతిలో మలుచుకుంటున్నాడు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.5.85 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. మరి ఇంత చేస్తే అతని శరీరం ఎలా మారిందనుకున్నారు? ఓ ఎముకల గూడులా! నుదురుపై ఎముకలు తేలేలా కనిపించడం, తలపై స్పైక్స్( త్రికోణాకతులు) పెట్టించుకోవడం, చేతిపై కొంత చర్మాన్ని డిజైన్ మేరకు తీసేయడం, నాలుకను రెండుగా చీల్చడం.. ఇలా 17 సార్లు బాడీ మాడిఫికేషన్స్ చేయించుకున్నాడు. అందులో భాగంగా 2019లో ఏకంగా చెవులు కూడా కత్తిరించుకున్నాడు. వాటిని ఓ జాడీలో భ్రదపరిచాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. (చదవండి: ముక్కులో ఇరుక్కున్న చెయ్యి: రెండేళ్ల తర్వాత..)
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్ల ఒళ్లు గగుర్పొడుస్తోంది. అతనికి పిచ్చి పట్టిందని, వెర్రోడని తిట్టిపోస్తూనే 'మిస్టర్ స్కల్ ఫేస్' అని పిలుస్తున్నారు. అయితే ఎవరెన్ని అంటున్నా తనకు మాత్రం ఇలా చేయడం వల్ల ఎక్కడలేని నమ్మకం వస్తుందంటున్నాడు. "నన్ను చూసి భయపడినా నేను లెక్క చేయను. ఒకవేళ నా మొహం పట్టుకునే నేను జబ్బున పడ్డ ముసలివాడిలా కన్పిస్తున్నారని చెప్పినా సరే. నన్ను పొగుడుతున్నందుకు థ్యాంక్స్ అని చెప్తాను. నోటికొచ్చినట్లుగా విమర్శించేవాళ్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ వీటన్నింటి వల్ల నా ఆత్మస్థైర్యం ఇంకా బలపడుతూనే ఉంటుంది" అని సాండ్రో చెప్పుకొచ్చాడు. ఆయన నెక్స్ట్ తన ముక్కు పైభాగాన్ని కత్తిరించే పనిలో పడ్డాడు. మరి ఇంత చేస్తే అతనికి ఏమైనా ప్రయోజం ఉందా అంటే అదీ శూన్యమే. 39 సంవత్సరాలున్న ఈ నిరుద్యోగి ఇప్పటికీ సింగిలే. (చదవండి: వైరల్: టాయిలెట్లోకి పాము ఎలా వచ్చింది!)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి