మద్యం మత్తులో మేనేజర్‌కు మెసేజ్‌.. ‘ఏందిరా ఇది’ అంటున్న నెటిజన్లు!

Boss Receives Drunk Text from Employee - Sakshi

మత్తులో మునిగినోడు నిజమే మాట్లాడతాడని, అన్నీ నిజాలే చెబుతాడని చాలా మంది అంటుంటారు. అలా మద్యం మత్తులో అన్నీ నిజాలే మాట్లాడేసి, ఆనక చిక్కుల్లో పడినవారు చాలామందే ఉంటారు. ఇదే బాపతుకు చెందిన ఒక మందుబాబు తన మేనేజర్‌తో చాట్‌ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఆ మేనేజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

మద్యం మత్తులో మునిగిన ఆ జూనియర్‌ తన బాస్‌కు అర్థరాత్రి 2:30కి మెసేజ్‌ చేసి, దానిలో.. ‘బాస్‌ నేను మద్యం మత్తులో ఉన్నాను. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నన్ను ముందుకు నడిపిస్తున్నందకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడం కన్నా మంచి మేనేజర్‌ దొరకడం ఎంతో కష్టం. నేను చాలా లక్కీ. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు అభినందనలు చెప్పుకోండి’ అని రాశాడు.  

ఈ పోస్టుకు క్యాప్షన్‌ రాసిన బాస్‌.. ఎక్స్‌ నుంచి మద్యం మత్తులో మెసేజ్‌లు రావడం సహజం. కానీ ఇటువంటి మెసేజ్‌లు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌ వైరల్‌ అయిన నేపధ్యంలో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏందిరా ఇది’ అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఒక యూజర్‌..‘మీరు చాలా అదృష్టవంతులు. మీ జూనియర్‌ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు’ అని రాయగా మరొకరు మీరు చాలా మంచి మేనేజరై ఉంటారు. లేకుంటే ఇలాంటి మెసేజ్‌లు మీకు రావు’ అని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: ఇది యానిమేటెడ్‌ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు!
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top