ఈ బిల్లులతో అమెజాన్‌ ప్రైమ్‌ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..!

Big Tech In Focus Next Week As Us House Panel Votes On New Antitrust Bills - Sakshi

వాషింగ్టన్‌: దిగ్గజ టెక్‌ కంపెనీలకు రానున్న రోజుల్లో  గడ్డుకాలం రానుందా..! అంటే  బహుశా రావచ్చునని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా తన దేశంలో ఉన్న దిగ్గజ టెక్‌ కంపెనీలపై యాంటీ ట్రస్ట్‌ బిల్లుల పేరిట ఇటివలే అమెరికా ప్రతినిధుల సభలో ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. కాగా ప్రస్తుతం యూఏస్‌ హౌజ్‌ జ్యూడిషియరీ కమిటీ వచ్చేవారం ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని కమిటీ చైర్‌పర్సన్‌ జెర్రీ నాడ్లర్‌ బుధవారం తెలిపారు.  ఈ బిల్లులకు అనుకూలంగా ఓటు వేయాలా వద్దా అనే విషయంపై ప్యానెల్‌ నిర్ణయించనుంది.

గత వారం ప్రతినిధుల సభలో  ప్రవేశపెట్టిన రెండు బిల్లులు అమెజాన్, గూగుల్‌కు చెందిన  ఆల్ఫాబెట్ దిగ్గజ కంపెనీలకు వ్యాపారం చేసుకోవడానికి  ఒకే వేదికను క్రియేట్‌ చేసుకోవచ్చునని ప్యానెల్‌ పేర్కొంది. కాగా ఈ బిల్లులతో అమెజాన్‌ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్‌ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లుతుందని వ్యాపార నిపుణులు  భావిస్తున్నారు. అంతేకాకుండా ఐఫోన్‌ మొబైల్లో అందించే ఫ్రీ సర్వీసులు కూడా నిలిచిపోతాయి. ప్రస్తుతం ఈ బిల్లులపై చాలా వ్యతిరేకత వస్తోంది. వీటితో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లులకు ఆమోదం వస్తే వినియోగదారులు అమెజాన్‌ నుంచి ఆర్డర్‌ చేసినప్పుడల్లా కచ్చితంగా డెలివరీ ఛార్జీలు పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుంగా ఆపిల్‌ ఐఫోన్‌లో అందించే పలు సర్వీసులకు కూడా పే చేయాల్సి వస్తోందని నిపుణుల పేర్కొన్నారు. ఆపిల్‌, అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ కంపెనీలను నియత్రించడానికి ఈ బిల్లులను పరిచయం చేశారని తెలుస్తోంది.

చదవండి: Bank Of America Report On IT Jobs: ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్‌ గండం!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top