1959లో హత్యాచారం.. డీఎన్‌ఏ టెస్ట్‌తో ఇప్పుడు తీర్పు.. ట్విస్ట్‌ ఏంటంటే

After 62 Years US Girl Murder Case Finally Solved With DNA Evidence - Sakshi

62 ఏళ్ల క్రితం అమెరికాలో చోటు చేసుకున్న దారుణం

9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య

అత్యాధునిక డీఎన్‌ఏ పరిజ్ఞానంతో ఇప్పుడు తీర్పు

వాషింగ్టన్‌: అత్యాచారం.. ఆడవారి జీవితాన్ని సమూలంగా నాశనం చేసే దుర్ఘటన. దురదృష్టం కొద్ది బాల్యంలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే.. వారు జీవితాంతం నరకయాతన అనుభవిస్తారు. ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా చిన్నారుల్లో అమ్మాయి, అబ్బాయి తేడా లేకుండా అకృత్యాల బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే నేటికి కూడా మన సమాజంలో అత్యాచార బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయాడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదు.

వచ్చిన కేసుల్లో సత్వర న్యాయం జరగడం లేదు. ఇక సమయం గడిచిన కొద్ది నిందితులకు శిక్షపడే అవకాశాలు తక్కువ. మన దగ్గర పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం 62 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని అత్యాచార కేసులో నేరస్థుడిగా నిర్ధారించింది కోర్టు. డీఎన్‌ఏ టెస్ట్‌ ఆధారంగా అతడిని దోషిగా తేల్చింది. ఆ వివరాలు..

62 ఏళ్ల క్రితం హత్యాచారం...
62 ఏళ్ల క్రితం అనగా 1959లో ఈ దారుణం చోటు చేసుంది. స్పోకనే వెస్ట్ సెంట్రల్ పరిసర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక క్యాంప్‌ఫైర్‌ మింట్స్‌ అమ్మడానికి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. బాలిక గురించి గాలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. రెండు వారాల తర్వాత చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు జాన్ రీగ్ హాఫ్. అప్పటికి అతడిపై పోలీసులకు ఎలాంటి అనుమానం కలగలేదు.
(చదవండి: లైంగిక వేధింపులు: ‘నన్ను క్షమించండి.. నాకు బతకాలని ఉంది.. కానీ’)

అందుకే నిందితుడిపై అనుమానం రాలేదు...
కారణం ఏంటంటే జాన్ రీగ్ హాఫ్ అమెరికా ఆర్మీలో సైనికుడిగా పని చేస్తుండేవాడు. అందుకని పోలీసులు అతడిని అనుమానించలేదు. ఇక దారుణానికి ఒడిగట్టిన సమయంలో జాన్‌ రీగ్‌ దారుణం జరిగిన స్పోకేన్ కౌంటీలోని ఫెయిర్‌చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేశారని తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలించసాగారు. 

పట్టించిన మరో దారుణం
ఈ క్రమంలో అప్పటికే 9 ఏళ్ల చిన్నారి ఉసురు తీసిన జాన్‌ రీగ్‌.. మరో దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు జాన్‌ రీగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడి వయసు 20 సంవత్సరాలు. మహిళను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు జాన్‌ రీగ్‌కి శిక్ష విధించింది. 
(చదవండి: కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..)

మహిళ హత్య కేసు విచారణ సమయంలో జాన్‌ రీగ్‌కు సంబంధించి పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు గుర్తించారు. బాలిక హత్యాచారానికి గురైన సమయంలో జాన్‌ రీగ్‌ ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. అయితే ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో అందుబాటులో లేకపోవడంతో బాలిక హత్యాచార కేసులో జాన్‌ రీగే నేరస్థుడని పోలీసులు నిరూపించలేకపోయారు. అప్పట్లో ఈ కేసు ‘మౌంట్‌ ఎవరెస్ట్‌’ పేరుతో ప్రసిద్ధి చెందింది. 

అత్యాధునిక డీఎన్‌ఏ పరిజ్ఞానం సాయంతో.. 
ఈ సంవత్సరం ప్రారంభంలో, టెక్సాస్‌లోని డీఎన్‌ఏ ల్యాబ్‌కు బాధితురాలి శరీరం నుంచి వీర్య నమూనాను తీసుకెళ్లడానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు అనుమతి లభించింది. ఇక చిన్నారి శరీరంపై ఉన్న వీర్య నమూనాలు ముగ్గురు అనుమానితుల్లో ఒకరితో సరిపోలింది. ఆ ముగ్గురు ఎవరనగా.. జాన్‌ రీగ్‌, అతడి ఇద్దరు సోదరులు. ఇక బాలిక శరీరం మీద లభ్యమైన వీర్య నమూనాలు జాన్‌ రీగ్‌తో సరిపోలాయి. దాంతో బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తి జాన్‌ రీగ్‌ అని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత కేసు మూసివేశారు. అదేంటి నేరస్థుడికి శిక్ష విధించాలి కదా అంటే.. అతడు దాదాపు 30 ఏళ్ల క్రితమే అనగా 1971లో మృతి చెందాడు. 
(చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు)

మరి కేస్‌ ఎలా చేధించారు అంటే..
మహిళను హత్య చేసిన కేసులో జాన్‌ రీగ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. బాలిక హత్యాచారం కేసులో అతడే నిందితుడై ఉంటాడని భావించారు. ఈ క్రమంలో జాన్‌ రీగ్‌తో పాటు అతడి తమ్ముళ్లిద్దరి వీర్య నమూనాలను, బాధిత బాలికపై సేకరించిన వీర్య నమూనాలను భద్రపరిచారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జాన్‌ రీగ్‌ను నేరస్థుడిగా నిర్థారించారు. కేసు చేధించేనాటికే అతడు మరణించడంతో ఫైల్‌ ముసివేశారు. 

చదవండి: మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top