Afghanistan: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్‌

Afghanistan: Nothing Should Be Done Weaken Regime Taliban Warns US - Sakshi

కాబుల్‌: తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను తాలిబన్లు హెచ్చరించారు. కాగా అఫ్గన్ నుంచి అమెరికా నాటో దళాలు వైదొలగిన తర్వాత తొలిసారి తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరిగిన సందర్భంగా తాలిబన్లు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ చర్చల అనంతరం అఫ్గన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ దీనిపై మాట్లాడుతూ.. ‘అఫ్గన్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసే ప్రయత్నాలు ఏ ఒక్కరికీ మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు.

"అఫ్గనిస్తాన్‌తో సత్సంబంధాలు అందరికీ మంచిది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆటంకం కలిగించేలా ఎవరూ ‍ప్రయత్నించిన ఉపేక్షించమని, పైగా ఇటువంటి చర్యలు ప్రజా సమస్యలకు దారీ తీస్తాయని హెచ్చరించారు. అనంతరం కరోనాను ఎదుర్కోవడానికి అమెరికా సహకరిస్తుందని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికా, తాలిబన్ తాత్కాలిక ప్రతినిధుల మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ప్రత్యేక ప్రతినిధి టామ్ వెస్ట్, అమెరికా మానవతా సాయం విభాగం అధికారి సారా చార్లెస్ పాల్గొన్నారు.  

అఫ్గన్‌లో సుమారు రెండు దశాబ్దాల తర్వాత అమెరికా దళాలు ఆగస్టు 31తో సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు మళ్లీ అఫ్గన్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు మాత్రం దక్కలేదు. 

చదవండి: Toddler Admitted To Hospital : బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్‌ చేసి అదరగొడుతున్నాడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top