జలాలాబాద్‌లో పేలుళ్లు.. ఇద్దరు మృతి: తాలిబన్‌ అధికారులు

2 Dead, Over 20 Injured in Fresh Blasts In Afghanistan Jalalabad - Sakshi

జలాలాబాద్‌: ఆప్గనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో 18 నుంచి 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. అంతేగాక మరణించిన వారిలో తాలిబన్‌ అధికారులూ ఉన్నట్లు తెలుస్తోంది. జలాలాబాద్‌లో జరిగిన వేరువేరు బాంబు పేలుళ్లో ఇద్దరు మృతి చెందినట్లు, 20 మంది వరకు గాయపడినట్లు తమకు సమాచారం అందిందని తాలిబన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే మృతుల పేర్లు మాత్రం వెల్లడించలేదు. గాయపడిన వారిలో మహిళలు, చిన్న పిల్లలున్నట్లు తెలిపారు. కాగా బాంబు దాడి ఘటనపై విచారణ జరగుతున్నట్లు వెల్లడించారు.

నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ రాజధాని జలాలాబాద్‌లోని తాలిబాన్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాలిబన్‌ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు. ఇదిలా ఉండగా ఆగస్ట్‌ 15న ఆప్గనిస్తాన్‌ను తాలిబన్లు మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుతూనే ఉన్నాయి.
చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి: యూఎన్‌
మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top