సీఐ తిక్క వేషాలు.. పెంపుడు కుక్కలు జనంపైకి.. అపార్ట్‌మెంట్‌ వాసులు హడల్‌! | - | Sakshi
Sakshi News home page

సీఐ తిక్క వేషాలు.. పెంపుడు కుక్కలు జనంపైకి.. భయాందోళనలో అపార్ట్‌మెంట్‌ వాసులు

Apr 10 2023 8:32 AM | Updated on Apr 10 2023 12:11 PM

ీసీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు  - Sakshi

ీసీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

హైదరాబాద్: పెంపుడు కుక్కతో తమాషా చేస్తూ..జనంపైకి ఉసిగొల్పిన ఓ సీఐపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎల్‌బీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్‌బీనగర్‌ చిత్రలేవుట్‌ కాలనీ మంజీరా హైట్స్‌ ఫేజ్‌–2లో నివాసం ఉండే డాక్టర్‌ ఎవీ జ్యోత్స్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తోంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే నాగేంద్రరావు హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఎలాంటి రక్షణ బెల్టు లేకుండా తన పెంపుడు కుక్కలను బయటకు తీసుకువస్తూ అపార్ట్‌మెంట్‌ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. దీనిపై ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోలేదు.

ఈ క్రమంలో గత నెల 31వ తేదీ రాత్రి 10: 30 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న డాక్టర్‌ ఎంవీ జ్యోత్స్న కుక్కలను బయటకు వదలొద్దని చెప్పింది. దీంతో ఆగ్రహించిన నాగేంద్రరావు డాక్టర్‌ను దుర్భాషలాడుతూ ఆమెను బెదిరించాడు. కుక్కలను ఆమె పైకి వదలి తమాషా చూస్తుండిపోయాడు. ఈఘటనతో తీవ్రంగా భయపడిన డాక్టర్‌ జోత్స్న ఈ నెల 1న ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సీఐ నాగేంద్రరావుపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. నాగేంద్రరావు ఆగడాలు సీసీ టీవీ కెమెరాల్లోనూ రికార్డయినట్లు అపార్ట్‌మెంటువాసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement