నేటి నుంచి కేఎంసీలో ‘ఉత్కర్ష’ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కేఎంసీలో ‘ఉత్కర్ష’

Nov 14 2026 7:51 AM | Updated on Nov 14 2026 7:51 AM

నేటి నుంచి కేఎంసీలో ‘ఉత్కర్ష’

కాశిబుగ్గ: నగరంలోని కాకతీయ వైద్య కళాశాలలో ఈనెల 11 నుంచి 17 వరకు ‘ఉత్కర్ష’ 2026 (వార్షిక కళాశాల ఉత్సవాలు) నిర్వహించనున్నారు. 2022 బ్యాచ్‌ జెంటారియంజ్‌ ఆధ్వర్యంలో వారం రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాసు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 11న బుధవారం నషా ముక్త్‌ భారత్‌ (మాదకద్రవ్య రహిత భారతదేశం) అవగాహన కోసం కేఎంసీ ప్రధాన ద్వారం నుంచి పోలీస్‌ కమిషనరేట్‌ వరకు హెల్త్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత, సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.

వారం రోజుల కార్యక్రమాల వివరాలు..

11న ఉదయం హెల్త్‌ రన్‌, మధ్యాహ్నం సాహిత్య పోటీలు, సాయంత్రం ప్రారంభోత్సం, 12న ఉదయం సాహిత్య పోటీలు, సాయంత్రం క్రీడా పోటీల ఫైనల్స్‌ ఉంటాయి. 13న ఉదయం ఇంప్లస్‌, సాయంత్రం షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌, 14న ఉదయం రక్తదాన శిబిరం, సాయంత్రం కార్నివాల్‌ నైట్‌, 15న ఉదయం ట్రెజర్‌ హంట్‌, సాయంత్రం దాండియా నైట్‌, 16న ఉదయం సంప్రదాయ దినోత్సవం, సాయంత్రం ఈడీఎం డీజే నైట్‌, 17న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మోహన్‌దాసు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement