మహిళా కాంగ్రెస్‌కు జిల్లా సారథులు | - | Sakshi
Sakshi News home page

మహిళా కాంగ్రెస్‌కు జిల్లా సారథులు

Nov 10 2026 1:37 AM | Updated on Nov 10 2026 1:37 AM

మహిళా కాంగ్రెస్‌కు జిల్లా సారథులు 15మంది ఎస్సైల బదిలీలు కేయూ మహిళా చెస్‌ జట్టు ఎంపిక పాఠశాల విద్యాశాఖ వరంగల్‌ ఆర్‌జేడీగా వెంకటనర్సమ్మ నేటినుంచి శ్రీభద్రకాళి సన్నిధిలో కార్తీక దీపోత్సవం

ఐదు జిల్లాలకు నియామకం

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఐదు జిల్లాలకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాళ్లను నియమించారు. ఈ మేరకు ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా ఈ జాబితాను ఆమోదించినట్లు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సోమవారం వెల్లడించారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా నీలం పద్మ, వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె రేణుక నియమితులయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా గుమ్మడి శ్రీదేవి, మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షురాలిగా జిన్నారెడ్డి పద్మజ, జనగామ జిల్లా అధ్యక్షురాలిగా వంగల కల్యాణి నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన సోమ లక్ష్మీకి అవకాశం కల్పించారు. ములుగు జిల్లాను పెండింగ్‌లో ఉంచారు. మహిళా అధ్యక్షురాళ్ల ఎంపికతో ఉమ్మడి వరంగల్‌లో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హసన్‌పర్తి: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 15 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈమేరకు సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. పి.తిరుపతి ఆత్మకూర్‌ నుంచి కొడకండ్ల, ఎన్‌.చెన్నకేశవ్‌ జనగామ నుంచి తరి గొప్పుల, ఎం.రమేశ్‌ సీసీఆర్‌బీ వరంగల్‌ నుంచి పీసీఆర్‌ వరంగల్‌, కె. హరికృష్ణ పీసీఆర్‌ అండ్‌ అటాచ్డ్‌ టు సీసీఆర్‌బీ వరంగల్‌ నుంచి సీసీఆర్‌బీ వరంగల్‌, కళ్యాణ్‌కుమార్‌ కేయూసీ నుంచి సీటీసీ వరంగల్‌, టి.శ్రావణి మిల్స్‌కాలనీ అటాచ్డ్‌ టు ఎహెచ్‌టీయూ నుంచి సుబేదారి, నైనాల నాగభూషణం అలియాస్‌ నగేష్‌ సీసీఎస్‌ వరంగల్‌ నుంచి హసన్‌పర్తి, సీహెచ్‌ రవికుమార్‌, వరంగల్‌ నుంచి జనగామ, ఎండీ ఫసీయోద్దీన్‌ వరంగల్‌ ట్రాఫిక్‌ నుంచి సీసీఎస్‌ వరంగల్‌, డి.వి. పాణి సుబేదారి నుంచి వరంగల్‌ ట్రాఫిక్‌, డి.సాంబయ్య మట్టెవాడ నుంచి కేయూసీ, ఎం.శంకర్‌ పీసీఆర్‌ వరంగల్‌ నుంచి మడికొండ, ఎం.కుమారస్వామి పీసీఆర్‌ వరంగల్‌ నుంచి ఆత్మకూర్‌, టి.కృష్ణమూర్తి పీసీఆర్‌ వరంగల్‌ నుంచి సీఎస్‌బీ వరంగల్‌, జి. రామకృష్ణచారి పీసీఆర్‌ వరంగల్‌ నుంచి నర్సంపేటకు బదిలీ అయ్యారు.

కేయూ క్యాంపస్‌: హైదరాబాద్‌లోని ఉమెన్స్‌ యూనివర్సిటీలో ఈనెల 9నుంచి ప్రారంభమై 12వ తేదీవరకు జరగనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌టోర్నమెంట్‌లో పాల్గొననున్న కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ డాక్టర్‌ టి.శాస్త్రి సోమవారం తెలిపారు. జట్టులో చిలకబత్తిని నవ్య, పూజశ్రీపుప్పాల, మాధురి కర్జ్‌, బచ్చలి నవ్య, కోరం పూజిత, కుర్సమ్‌ సాహిత్య ఉన్నారు. జట్టుకు టీజీటీ డబ్ల్యూఆర్‌డీసీ(ఖమ్మం) ఫిజికల్‌ డైరెక్టర్‌ బి రమ్య, కోచ్‌కమ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారని శాస్త్రి తెలిపారు.

విద్యారణ్యపురి: పాఠశాల విద్య వరంగల్‌ ఆర్‌జేడీగా (రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌) పుల్‌ అడిషనల్‌ చార్జి (ఎఫ్‌ఏసీ) బి.వెంకటనర్సమ్మను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వెంకటనర్సమ్మ హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ (సర్వీసెస్‌)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలం క్రితమే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మికి వరంగల్‌కు పోస్టింగ్‌ ఇవ్వగా ఆమె బాధ్యతలు చేపట్టలేదు. సెలవుల్లో కొనసాగుతున్నారు. దీంతో ఆమెస్థానంలో వెంకటనర్సమ్మకు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

హన్మకొండ కల్చరల్‌: కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా నేటి(మంగళవారం)నుంచి ప్రతీరోజూ శ్రీభద్రకాళి దేవాలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈఓ రామల సునీత తెలిపారు. ఈ మాసంలో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, రుద్రహోమాలుంటాయని పేర్కొన్నారు. శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం మణిపూర్‌ రాష్ట్రం నోని జిల్లాకు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీధర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement