వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 34 ఫిర్యాదులు అందాయి. ఇన్‌చార్జ్ అడిషనల్ కమిషనర్ సమ్మయ్య, ఆయా విభాగాల అధికారులు నగరవాసులనుంచి వినతులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు 14, ఇంజనీరింగ్ – 11, హెల్త్–శానిటేషన్ విభాగం– 5, నీటి సరఫరా–3, రెవెన్యూ విభాగానికి 1 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఉద్యావనవన అధికారి లక్ష్మారెడ్డి, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ, ఆరోగ్యాధికారి డా.రాజేష్ పాల్గొన్నారు.
లక్ష్మిపురంవాసుల నిరసన
26వ డివిజన్ లక్ష్మిపురంలో ఓ రాజకీయ నేత రోడ్డు, డ్రెయినేజీ ఆక్రమించుకున్నారంటూ స్థానికులు కౌన్సిల్ హాల్‌లో ప్లకార్డులతో నిరసన తెలిపారు.


