కాళోజీ సెంటర్ : బొల్లికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అబ్బోజు భరత్ వాలీబాల్ జిల్లా జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం అభినందనీయమని హెచ్‌ఎం ఎండీ ముజాహిద్ అలీ అన్నారు. హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో అక్టోబర్ 31న నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫౌండేషన్ (ఎస్‌జీఎఫ్) పోటీల్లో భరత్‌ను జిల్లా కెప్టెన్‌గా ఎంపిక చేశారని తెలిపారు. ఈసందర్భంగా ఆదివారం హెచ్‌ఎం మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అకాంక్షించారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తూ తీర్చిదిద్దుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడు బాబును అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు అలివేలు మంగ, పూల రవి, సీహెచ్.కృష్ణారెడ్డి, జయ, తాబేటి కుమారస్వామి, దయాకర్, వంశీ మోహన్ తదితరులు భరత్‌ను అభినందించారు.


