కాజీపేట రూరల్ : కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్) తెలంగాణకు ఒక మణిహారమని, త్వరలో ప్రారంభించేందుకు అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నట్లు అడిషనల్ మెంబర్ ఆఫ్ రైల్వే బోర్డ్ సునీల్‌కుమార్ తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన.. రైల్వే బోర్డు డైరెక్టర్ జయంత్ రామచంద్రన్‌తో కలిసి సందర్శించారు. సుమారు 5 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మెయిన్‌షాప్, పెయింట్ షాప్, టెస్ట్‌షాప్, స్టోర్‌వార్డు, క్యాంటీన్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయ సముదాయం, ప్రాంగణంలో రోడ్లు, ట్రాక్, తదితర వాటి నాణ్యతా ప్రమాణాలు, పలు నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి సూచనలిచ్చారు. అనంతరం సునీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో రైల్వే నిబంధనల మేరకు డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంతం వారికి న్యాయం జరిగేలా రైల్వేశాఖ కృషి చేస్తుందన్నారు. కోచ్‌ఫ్యాక్టరీలో ముందుగా మెము బోగీలను తయారు చేస్తారన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వేనుంచి పీసీఎంఈ విజయ్‌కుమార్, సీఎంఈ లచ్చిరాంభూక్యా, కాజీపేట సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్, ఆర్‌వీఎన్‌ఎల్ నుంచి సీపీఎం సాయినాథ్, జీజీఎం మురళీకృష్ణ, జీఎం శ్రీనివాస్, పవర్‌మెక్ ప్రాజెక్ట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ రాంచందర్‌రాజు, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్‌సాగర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
మొదటగా మెము బోగీల ఉత్పత్తి
రైల్వే అడిషనల్ బోర్డు మెంబర్
సునీల్‌కుమార్


