గండం గట్టెక్కుదాం..! | - | Sakshi
Sakshi News home page

గండం గట్టెక్కుదాం..!

Oct 23 2026 1:33 AM | Updated on Oct 23 2026 1:33 AM

గండం గట్టెక్కుదాం..! నీటి వృథాను అరికడదాం..

అధికారులు ఇలా చేయాలి..

ప్రతీ నల్లా నీటి ప్రవాహాన్ని నియంత్రించే స్టాపర్లను ఏర్పాటు చేసేలా నోటీసులు ఇవ్వాలి. వృథా చేసే వారిని గుర్తించి అవసరమైతే జరిమానాలు విధించి వసూలు చేయాలి.

● పురాతన కాలం నాటి వాల్వ్‌లు, ట్యాంకర్లలోని లోపాలను సరిచేయాలి.

● భవన నిర్మాణం సమయంలో తీసుకుంటున్న ఫీజుకు వెంటనే ఇంకుడుగుంతలను నిర్మించాలి. దీనివల్ల వృథా నీరు ఆ గుంతల్లోకి వెళ్లి భూగర్భజలాలు పెరుగుతాయి.

● పైప్‌లైన్లు, గేట్‌వాల్వ్‌ల లీకేజీల గుర్తింపునకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలి. తెలిసిన వెంటనే అరికట్టాలి.

● తాగునీటి నిల్వల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.

వరంగల్‌ అర్బన్‌ : స్నానాల గదిలో.. వంటశాలలో నల్లా సరిగ్గా ఆపేశామా లేదా? అనేది చాలామంది పట్టించుకోరు. ఒక్కో చుక్క నీరుకారుతున్నా.. ఏం కాదులే అని వదిలేస్తారు. ఒక్క చుక్కే కదా అని అనుకోవచ్చు. దీని వల్ల జరిగే నీటి వృథా లెక్క చివరికి భారీగా ఉంటుంది. ఒక సెకనుకు ఒక బొట్టు చొప్పున ..గంటకు 1.37 లీటర్లు వృథా.. అదే రో జంతటికీ 32.91 లీటర్లు. ఏడాదికి 12,015 లీటర్లు. అంటే 2,700 గ్యాలన్లు అన్నమాట. ఈ ఒక్క లెక్క చాలు. నీటి వృథా ఎంత మేర జరుగుతుందో చెప్పడానికి. ఇప్పటికే వరంగల్‌ మహా నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఒకవైపు పైప్‌లైన్లు, గేట్‌వాల్వ్‌ల దగ్గర లీకేజీలు, కేబుళ్ల కోసం రోడ్డును తవ్విన సమయంలో పైప్‌లైన్ల ధ్వంసం.. ఇలా పలు విధాలుగా నీరు వృథాగా డ్రెయినేజీల్లో కలిసిపోతోంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే ఎంతో విలువైన జలాలను పొదుపు చేయవచ్చు.

పొంచి ఉన్న నీటిముప్పు

వరంగల్‌ మహా నగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం నగరానికి ప్రధాన జలాశయమైన ధర్మసాగర్‌లో 110 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. మరో నెల రోజులపాటు దేవాదుల ప్రాజెక్టునుంచి రెండు పైప్‌లైన్ల ద్వారా నీటి పంపింగ్‌ జరుగుతుందని ఇరిగేషన్‌ అధికారులు పేర్కొంటున్నారు. కానీ, ఎల్‌నినో ఎఫెక్ట్‌ ఇలానే ఉంటే వచ్చే ఏడాది నీటి ముప్పు తప్పదనే సంకేతాలు ఉన్నాయని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటిలో 20 శాతం పైప్‌లైన్ల, గేట్‌ వాల్వ్‌ల ద్వారా నీరు లీకేజీ రూపంలో డ్రెయినేజీల్లో కలుస్తోంది. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ 1.50 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 900 ఎంసీఎఫ్‌టీల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో 20శ ాతం ఆవిరి, లీకేజీలు 20శాతం పోగా 540 ఎంసీఎఫ్‌టీలు ఉంటాయి. ఈ లెక్కన రోజుకు 6.5 ఎంసీటీపీఎఫ్‌టీలు నీరుగా శుద్ధి చేసి వాడగా 83 రోజులకు మాత్రమే నీరు సరిపోతోంది. మరో రెండు నెలలపాటు దేవా దుల నుంచి పంపింగ్‌ ఉంటుందని, ఈ నేపథ్యంలో మరో ఏప్రిల్‌ వరకు నీటి సమస్య నగరంలో ఉత్పన్నం కాదని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.

పొదుపుగా వాడుకోవాలి..

ఎల్‌నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా నీటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్‌లో కొరత ఉండకుండా చూడాలంటే నీటిని నగర ప్రజలు పొదుపుగా వాడుకోవాలి. అందరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. బల్దియాపరంగా నీటి కొరత లేకుండా సమాలోచనలు చేస్తున్నాం.

– రాజ్‌కుమార్‌, బల్దియా ఎస్‌ఈ

గ్రేటర్‌ పరిధిలో పైప్‌లైన్ల

లీకేజీలతో 20 శాతం వృథా

వాటిని అరికట్టాలి.. పౌరస్పృహగా

అందరూ భాగస్వాములవ్వాలి

తాగునీటి నిల్వలు

మార్చి నెలాఖరువరకే

ఇంకుడుగుంతల సక్రమ

నిర్వహణే మార్గం

ఎల్‌నినో ఎఫెక్ట్‌

తప్పదంటున్న నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement