వరంగల్ చౌరస్తా: ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత గురువారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణపై సీపీ అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట హనుమకొండ ఏసీపీ ఇన్‌చార్జ్ నర్సింగరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వడ్డేపల్లి బండ్‌పై వాకింగ్
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ వడ్డేపల్లి బండ్‌పై గురువారం ఉదయం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేశారు. సీపీ శ్వేతను ఆలస్యంగా గుర్తించిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలను చర్చించారు. వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు.. సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం కోసం చేపడుతున్న కార్యక్రమాలను అధ్యక్ష, కార్యదర్శులు బొల్లెపల్లి రాజేశ్, ఆరెల్లి శ్రీనివాస్ వివరించారు.
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో నలుగురు నాయబ్ తహసీల్దార్లకు స్థానచలనం కల్పించారు. బి.శ్రావణిని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయానికి, ఎం.రహీం పాషాను పరకాల ఆర్డీఓ కార్యాలయానికి నాయబ్ తహసీల్దార్లుగా బదిలీ చేశారు. అశోక్– పరకాల, ఎ.సుమ – హసన్‌పర్తి నాయబ్ తహసీల్దార్లుగా, డీడీఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
వరంగల్ లీగల్: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం నవంబర్ 21న (శనివారం) హనుమకొండ జిల్లా కోర్టు, పరకాల కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.రామకృష్ణ సునీత తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రాజీకి అనుకూలమైన 78 నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఏఐ) యాక్ట్ కేసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటి పరిష్కారం కోసం హనుమకొండ కోర్టులో నాలుగు, పరకాల కోర్టులో ఒక బెంచ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కక్షిదారులు ఇరుపక్షాల అంగీకారంతో తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌కు సంబంధించి సందేహాలు, న్యాయపర సమస్యలున్నవారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచి త న్యాయసలహాలు పొందొచ్చని సూచించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ హాస్టల్‌నుంచి కెనాల్ సమీపంలోని కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల వరకు రూ.1.34 కోట్ల వ్యయంతో కిలోమీటర్ మేర చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా పరీక్షల విభాగం పక్కనే రూ.1.67 కోట్ల వ్యయంతో పరీక్షల విభాగం రెండో బ్లాక్ భవనం నిర్మించారు. ఈ రెండు అభివృద్ధి పనులను నేడు (శుక్రవారం) కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. అభివృద్ధి అధికారి ఆచార్య వై.వెంకయ్యతో కలిసి ప్రారంభించనున్నారు.
కాళోజీ సెంటర్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఈనెల 24న ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి అధికారి బి.సాత్విక్ తెలిపారు. జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, అమెరికా, దుబాయ్, ఖతర్, ఇజ్రాయెల్, మలేషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఓమన్, మారిషస్, ఫిజీ తదితర దేశాల్లో ఉద్యోగాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నర్సింగ్, ఫిజియోథెరపీ, హోంకేర్, డ్రైవింగ్, నిర్మాణరంగం, వెల్డింగ్, స్టీల్ ఫ్యాబ్రికేషన్ తదితర విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ములుగు రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ (బాయ్స్) ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు టామ్‌కామ్ హెల్ప్‌లైన్ 08035524946 లేదా www.tom com. telangana.gov.inను సంప్రదించాలని కోరారు.


