పౌర స్పృహతో ఇలా ఆదా చేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

పౌర స్పృహతో ఇలా ఆదా చేద్దాం..

Oct 23 2026 1:33 AM | Updated on Oct 23 2026 1:33 AM

పౌర స్పృహతో ఇలా ఆదా చేద్దాం..

ప్రతీ ఒక్కరూ నీటి ఆదాను మన ఇంటినుంచే మొదలుపెట్టాలి. వంట గదిలో అన్ని పాత్రల్ని ఒకేసారి శుభ్రం చేయాలి. ప్రతిసారీ కడగడం వల్ల నీరు వృథా అవుతుంది.

● నల్లాకింద పెద్ద పాత్రలు పెట్టి చిన్నవి శుభ్రం చేయడంతో నీళ్లను ఆదా చేయవచ్చు. పాత్రలకు అంటిన ఆహార పదార్థాలను పూర్తిగా తొలగించాక కడిగితే .. 50 శాతం ప్రక్రియను 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు.

● బకెట్‌లో నీళ్లు పట్టి చిన్న సైజు మగ్గును వాడాలి.

● రోజు ఎక్కువ మంది వినియోగిస్తున్న నీటిలో గార్డెనింగ్‌, వాహనాలను కడిగేందుకు 7 శాతం ఖర్చు చేస్తున్నారు.

● వంటగదిలో వాడుతున్న నీళ్లు మురికి కాల్వ లో కలిసిపోతుంటాయి. వాటిని ప్రత్యేక వ్యవస్థతో ఒక గుంతలోకి పంపి బ్లీచింగ్‌ కలిపి గార్డెనింగ్‌, ఇతర అవసరాలకు వాడాలి.

● ఎక్కడైనా పైప్‌లైన్‌ పగిలినట్లు గుర్తిస్తే పౌర స్పృహతో సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలి.

● పబ్లిక్‌ నల్లాలనుంచి నీళ్లు వృథాగా పోతే. వాటిని కట్టేసి ముందుకు సాగాలి.

● ట్యాంకర్లు వచ్చినప్పుడు క్యూలో నిలబడి పట్టుకుంటే మంచిది. ఎగబడడం ద్వారా నీరు వృథా అవుతుంది. రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లలోని నల్లాలు వదిలిపెడితే వెంటనే వాటిని ఆఫ్‌ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement