హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంగు వెంకట్రాజం, ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, ముదిరాజ్ సంఘం నాయకులు పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహాయ బీసీ సంక్షేమ అధికారి సంపూర్ణతో పాటు సంఘాల ప్రతినిధులు దేవేందర్ ముదిరాజ్, పొన్నంరాజ్, పులి రజనీకాంత్, పొన్నం మొగిలి, బండి సారంగపాణి, ఇతర అధికారులు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్, డీసీడీఓ పుష్పలత, ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాధ్యులు దేవేందర్ తదితరులున్నారు.


