మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు
నిత్యావసర సరుకుల ధరల వివరాలు.. (రూపాయల్లో)
280
172
180
140
145
120
160
170
100
190
ఖిలా వరంగల్: నిత్యావసర సరుకుల ధరలు నగర సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చక్కెర, సన్నబియ్యం, అల్లం వెల్లుల్లి, ఉల్లి, వంట నూనెలు తదితర రేట్లు భారీగా పెరిగాయి. 50 రోజుల వ్యవధిలో సన్నబియ్యం ధరలు క్వింటాలుకు రూ.1500కు పైగా పెరిగాయి. చక్కెర, బియ్యం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ,అల్లం, కూరగాయలు, వంటనూనెల ధరలు అకాశాన్నంటాయి. నెల కిందట రూ.250 చెల్లిస్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 చెల్లించాల్సి వస్తోంది. ఎల్నినో ప్రభావంతో పంటలు దిగుబడి అంతంత మాత్రంగానే ఉండడం, డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.
సన్నబియ్యం ధరలకు రెక్కలు
ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు దిగొచ్చాయి. ఎల్నినో ప్రభావంతో మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మధ్య తరగతి ప్రజలు వినియోగించే 25 కిలోల సన్నబియ్యం బస్తా ధర నాలుగు నెలల క్రితం రూ.1400 ఉండగా ప్రస్తుతం రూ.2100కి చేరింది. మిగిలిన రకాల బియ్యం ధరలు రూ.300కు పైగా పెరిగాయి. రిటేల్గా తీసుకుంటే గతంలో కిలోకు రూ.55 ఉన్న సన్నబియ్యం ఇప్పుడు 79కు చేరింది. జైశ్రీరాం, సోనమసూరి కిలో రూ.65 నుంచి రూ.80 వరకు ధరకు విక్రయిస్తున్నారు. కిలో టమాట రూ.20 నుంచి రూ.30 ఉండగా.. మిగిలిన కూరగాయలు కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నాయి.
నియంత్రణపై దృష్టి పెట్టాలి..
నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వంతోపాటు ధరల నియంత్రణ కమిటీలు కూడా దృష్టి పెట్టాలి. కేవలం 50 రోజుల్లోనే ధరలు ఈవిధంగా పెరిగిపోతే భవిష్యత్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. వరంగల్ నగరంలో కొందరు వ్యాపారులు సన్న బియ్యాన్ని రహస్యంగా నిల్వ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారులు అక్రమ నిల్వలను గర్తించడానికి తనిఖీలు చేస్తే ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశాలున్నాయి.
150
155
130
79
110
55
20
వెల్లుల్లి
ఉల్లిగడ్డ
అల్లం
సన్న బియ్యం
80
50
కందిపప్పు
పెసరుపప్పు
చక్కెర
వేరుశనగలు
పల్లి నూనె
శనగపప్పు
పామాయిల్
సన్ఫ్లవర్ ప్యాకెట్
చక్కెర, సన్నబియ్యం, అల్లం వెల్లుల్లి, ఉల్లి, వంట నూనెల రేట్లు ౖపైపెకి
బెంబేలెత్తుతున్న సామాన్య, మధ్య
తరగతి ప్రజలు.. తగ్గించాలని విజ్ఞప్తి


