సంగెం: దాడి కేసులో వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బీవీవీ చంద్రప్రసన్న తీర్పు వెలువరించినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన గూడ రవీందర్‌పై అదే గ్రామానికి చెందిన గూడ సంపత్.. దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి 2016 సంవత్సరంలో సంగెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయమూర్తి బీవీవీ చంద్రప్రసన్న.. నిందితుడు గూడ సంపత్‌ను దోషిగా నిర్ధారించి తీర్పును వెల్లడించారు.


